హువావే మొట్టమొదటి ఓవర్-ఇయర్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్.. కాల్స్ కోసం 6 మైక్‌లు..
హువావే హెడ్‌ఫోన్స్‌లో యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ (ఏఎన్‌సి), ఓమ్ని డైరెక్షనల్ 8-మైక్రోఫోన్ సిస్టమ్‌తో హెడ్‌ఫోన్‌లను అందుబాటులోకి తెచ్చారు. హువావే ఫ్రీబడ్స్ స్టూడియో హువావే సంస్థ నుండి మొట్టమొదటి ఓవర్-ఇయర్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్.
స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హువావే మేట్ 40 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు కొత్త హెడ్‌ఫోన్ విడుదల చేసింది. హువావే హెడ్‌ఫోన్స్‌లో యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ (ఏఎన్‌సి), ఓమ్ని డైరెక్షనల్ 8-మైక్రోఫోన్ సిస్టమ్‌తో హెడ్‌ఫోన్‌లను అందుబాటులోకి తెచ్చారు.
హువావే ఫ్రీబడ్స్ స్టూడియో హువావే సంస్థ నుండి మొట్టమొదటి ఓవర్-ఇయర్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్. ఈ హెడ్‌ఫోన్ బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు.
హువావే ఫ్రీబడ్స్ స్టూడియో స్పెసిఫికేషన్
ఈ హెడ్‌ఫోన్లో మొబైల్ కాలింగ్ కోసం 6 మైక్‌లను అమర్చగా, తక్కువ-జాప్యం గేమింగ్ మోడ్‌తో పాటు 40 ఎంఎం డైనమిక్ డ్రైవర్ ఇందులో ఉన్నాయి. హెడ్‌ఫోన్ బ్యాటరీ లైఫ్ సంబంధించి 24 గంటల బ్యాకప్ ఉంటుందని కంపెనీ క్లెయిమ్ చేసింది. ఈ హెడ్‌ఫోన్‌ను 60 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.
also read తక్కువ ధరకే ఫేస్ అన్‌లాక్ ఫీచర్ తో జియోనీ ఎఫ్8 నియో కొత్త స్మార్ట్‌ఫోన్.. ...
హువావే హెడ్‌ఫోన్‌ల ధర సుమారు $ 353 అంటే సుమారు 25,967 రూపాయలు. హువావే ఫ్రీబడ్స్ స్టూడియో నవంబర్ నుండి అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో లభ్యత, ధరల గురించి పూర్తి వివరాలు లేవు.
హువావే ఫ్రీబడ్స్ స్టూడియో ధర భారతదేశంలో సుమారు రూ.30వేలు ఉంటుండొచ్చు అని అంచనా. హువావే ఫ్రీబడ్స్ స్టూడియో హెడ్‌ఫోన్‌లు ఇటీవల ప్రారంభించిన సోనీ WH-1000XM4 తో పోటీ పడనుంది.
హువావే ఫ్రీబడ్స్ స్టూడియోలో 4-లేయర్, 40 ఎంఎం డైనమిక్ డ్రైవర్, 4 హెర్ట్జ్ నుండి 48 కిలోహెర్ట్జ్ మధ్య ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉంటుంది. హెడ్‌ఫోన్‌లలోని యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ వేర్వేరు వాతావరణాలకు అనుగుణంగా ఆటోమాటిక్ గా అడ్జస్ట్ చేస్తుంది, అలాగే 40 డెసిబెల్ వరకు నాయిస్ క్యాన్సల్ చేయగలదు.
ఇందులో 410 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఛార్జింగ్ కోసం యూఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఈ హెడ్‌ఫోన్ బరువు 260 గ్రాములు.