Asianet News TeluguAsianet News Telugu

మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లలో ఎస్‌ఎం‌ఎస్ పంప‌లేక‌పోతున్నారా.. అయితే ఈ యాప్ వెంటనే డిలెట్ చేయండి..

వినియోగదారులు ఎస్ఎంఎస్ పంపించిన తరువాత దాదాపు 30 నిమిషాల తరువాత డెలివరీ అవుతున్నాయని, మరికొందరికి గంటకు పైగా సమయం పడుతుందని వినియోగదారులు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు చేశారు.

How to fix the SMS issue on Android phones: Uninstall the Google Carrier Services app now
Author
Hyderabad, First Published Dec 12, 2020, 4:50 PM IST

చాలా మంది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఎస్‌ఎం‌ఎస్ సర్వీసులపై  ఫిర్యాదులు చేస్తున్నారు. ఆండ్రాయిడ్ సెంట్రల్ గుర్తించినట్లుగా న‌వంబ‌ర్ 23న గూగుల్ క్యారియర్ సర్వీసెస్ యాప్ అప్ డేట్ చేసినప్పటి నుండి స్మార్ట్ ఫోన్ లో ఎస్‌ఎం‌ఎస్ సర్వీస్ ప్రభావితమైనట్లు    వెల్ల‌డించింది.

వినియోగదారులు ఎస్ఎంఎస్ పంపించిన తరువాత దాదాపు 30 నిమిషాల తరువాత డెలివరీ అవుతున్నాయని, మరికొందరికి గంటకు పైగా సమయం పడుతుందని వినియోగదారులు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు చేశారు.

రెడ్డిట్, ఇతర ఫోరమ్లలో చాలా ఫిర్యాదులు వచ్చినప్పటికి ఈ సమస్యకు సంబంధించి గూగుల్ లేదా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు నుండ ఎటువంటి స్పందన లేదు.

ఈ సమస్యకు అత్యవసర పరిష్కారం అవసరం కాబట్టి మీ స్మార్ట్‌ఫోన్ నుండి గూగుల్ క్యారియర్ సర్వీసెస్ యాప్ అన్‌ఇన్‌స్టాల్ చేయడం ద్వారా సమస్యను తాత్కాలికంగా పరిష్కరించవచ్చని  అండ్రాయిడ్ అథారిటీ సూచిస్తుంది.

also read పోర్ట్రానిక్స్ కొత్త వైర్‌లెస్ నెక్‌బ్యాండ్ లాంచ్‌.. 10నిమిషాల ఛార్జింగ్ తో 4 గంటల బ్యాకప్.. ...

కాబట్టి, మీరు మీ స్మార్ట్ ఫోన్ లో ఎస్‌ఎం‌ఎస్ సేవలతో సమస్యలను ఎదుర్కొంటుంటే, ప్రస్తుతం గూగుల్ క్యారియర్ సర్వీస్ యాప్ అన్‌ఇన్‌స్టాల్ చేయడం ఉత్తమం.

ఇందుకు  మీ స్మార్ట్ ఫోన్ సెటింగ్స్ లో  మై యాప్స్ ఓపెన్ చేసి  గూగుల్ ప్లే స్టోర్‌లోని గేమ్స్ విభాగానికి వెళ్లి, ‘క్యారియర్ సర్వీసెస్’ పైన  ‘అన్‌ఇన్‌స్టాల్’ బటన్ నొక్కండి.

మీరు దాన్ని అన్‌ఇన్‌స్టాల్ చేసిన తర్వాత, మీరు మీ స్మార్ట్‌ఫోన్‌ను రీబూట్ చేయాలి. తరువాత  మీరు ఎప్పటిలాగే ఎస్‌ఎం‌ఎస్ పంపవచ్చు, స్వీకరించవచ్చు.

 మీరు గూగుల్ క్యారియర్ సేవలను అన్‌ఇన్‌స్టాల్ చేసే ముందు గూగుల్ క్యారియర్ సర్వీసెస్ గూగుల్ మెసేజెస్ యాప్ లో లేటెస్ట్ కమ్యూనికేషన్ సేవలు, ఫీచర్‌లను ఎనేబుల్ చేస్తుందని మీరు గుర్తుంచుకోవాలి, కాబట్టి మీరు యాప్ మళ్లీ ఇన్‌స్టాల్ చేయకపోతే మీరు ఏ కొత్త ఫీచర్‌లను ఉపయోగించలేరు.

Follow Us:
Download App:
  • android
  • ios