ఇండియాలోకి మొట్టమొదటి హానర్‌ తొలి ల్యాప్‌టాప్‌ వచ్చేసింది.. ధర ఎంతంటే ?

దేశంలో మొట్టమొదటి  హానర్ మ్యాజిక్ బుక్ 15ను  లాంచ్ చేసింది. విండోస్‌ ప్రీ ఇన్‌స్టాల్, ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, పైభాగం, అన్నీ వైపులా స్లిమ్ బెజెల్స్‌ డిజైన్, ఏఎంబీ రైజెన్‌ 3000 సిరీస్ సీపీయూలు, వేగా గ్రాఫిక్‌ లాంటి ఫీచర్లు ఉన్నాయి.

Honor MagicBook 15 has been launched in India

లాక్ డౌన్ కారణంగా ఆన్ లైన్ క్లాసులకు ప్రాధాన్యత ఏర్పడింది. దీంతో స్మార్ట్ ఫోన్స్, ఎలక్త్రోనిక్ వస్తువులకి డిమాండ్ పెరిగింది. స్మార్ట్ ఫోన్ బ్రాండ్ హానర్  లాప్ టాప్ తయారీ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. దేశంలో మొట్టమొదటి  హానర్ మ్యాజిక్ బుక్ 15ను  లాంచ్ చేసింది.

విండోస్‌ ప్రీ ఇన్‌స్టాల్, ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, పైభాగం, అన్నీ వైపులా స్లిమ్ బెజెల్స్‌ డిజైన్, ఏఎంబీ రైజెన్‌ 3000 సిరీస్ సీపీయూలు, వేగా గ్రాఫిక్‌ లాంటి ఫీచర్లు ఉన్నాయి. హానర్‌ మ్యాజిక్‌ బుక్ 15 సింగిల్ కలర్ వేరియంట్లో వస్తుంది. ఆగస్టు మొదటి వారం నుండి సేల్స్ ప్రారంభమవుతాయి. హానర్ ఫస్ట్ సేల్స్  డిస్కౌంట్ ధరకె లభిస్తుందని చెప్పారు.


భారతదేశంలో హానర్‌ మ్యాజిక్‌ బుక్ 15 ధర

హానర్‌ మ్యాజిక్‌ బుక్ 15 ధర భారతదేశంలో రూ.42,990, ఆగస్టు 6 నుండి మిస్టిక్ సిల్వర్ కలర్‌లో సేల్స్ ప్రారంభమవుతాయి. ఆగస్టు 6 ఉదయం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది, అయితే ఫ్లిప్‌కార్ట్ ప్రారంభ ఎర్లీ అక్సెస్ మేంబర్స్ కోసం ఆగస్టు 5, రాత్రి 8 గంటల నుండి కొనుగోలు చేయవచ్చు.

also read ఫ్రీగా ఫోన్ డేటా బ్యాక్‌అప్‌ చేయాలనుకుంటున్నారా... అయితే ‘గూగుల్‌ వన్‌’లో మీకోసం .. ...

హానర్ మొదటి అమ్మకాలు రూ.3000 తగ్గింపు ధరతో రూ. 39.990కే పొందవచ్చు. ముఖ్యంగా, హానర్ హానర్‌ మ్యాజిక్‌ బుక్15 ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరిలో లాంచ్  చేశారు. అయితే ఇప్పుడు భారత మార్కెట్లోకి ప్రవేశించింది.


హానర్ హానర్‌ మ్యాజిక్‌ బుక్ 15 స్పెసిఫికేషన్లు
హానర్ హానర్‌ మ్యాజిక్‌ బుక్ 15  ఫ్రే ఇన్‌స్టాల్ విండోస్ 10 హోమ్, 15.6-అంగుళాల పూర్తి-హెచ్‌డి (1,920x1,080 పిక్సెల్స్) ఐపిఎస్ డిస్‌ప్లేతో 87 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో, బ్లూ లైట్ ఎఫెక్ట్‌ను తగ్గించడానికి టివి రీన్‌ల్యాండ్ సర్టిఫికేషన్, ఏ‌ఎం‌డి  రైజెన్ 5 3500యు ప్రాసెసర్‌తో పాటు రేడియన్ వేగా 8 గ్రాఫిక్స్, 8జి‌బి డి‌డి‌ఆర్4 డ్యూయల్-ఛానల్ ర్యామ్‌తో పనిచేస్తుంది. స్టోరేజ్ కోసం మీకు 256GB PCIe NVMe SSD లభిస్తుంది.

ఈ ల్యాప్‌టాప్‌ ఛార్జింగ్ కోసం టైప్-సి పోర్ట్‌ను ఉపయోగించే 65W ఛార్జర్‌తో వస్తుంది. దీనిని కేవలం 30 నిమిషాల్లో 50 శాతానికి చార్జ్ చేయవచ్చని హానర్ కంపెనీ తెలిపింది. వీడియోలను నిరంతరం చూసేటప్పుడు బ్యాటరీ 6.3 గంటలు ఉంటుందని చెబుతున్నరు.

హానర్ మ్యాజిక్‌ బుక్ 15 లో ఎస్-ఆకారపు ఫ్యాన్ ఉంది, దీనిలోని 49 శాతం ఫ్యాన్ బ్లేడ్‌లు వేడిని అదుపులో ఉంచుతాయి. సన్నగా ఉండే బ్లేడ్లు ప్రభావవంతమైన ఎయిర్ ప్రవాహంతో 38 శాతం వేడిని తగ్గేల చేస్తాయి.

మీరు సురక్షిత లాగిన్‌ల కోసం టూ-ఇన్-వన్ ఫింగర్ ప్రింట్ పవర్ బటన్‌ వస్తుంది. కనెక్టివిటీలలో హానర్ మ్యాజిక్‌బుక్ 15 వై-ఫై, బ్లూటూత్, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి 2.0, యుఎస్‌బి 3.0, హెచ్‌డిఎంఐ పోర్ట్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌తో వస్తుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios