భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్‌లో హై-స్పీడ్ ఇంటర్నెట్ పై నిషేధాన్ని జనవరి 8 వరకు పొడిగించింది. కాగా గండెర్బల్, ఉధంపూర్ కి ఈ నిషేధం నుండి మినహాయింపు కల్పించింది. జమ్మూ కాశ్మీర్‌లో హైస్పీడ్ ఇంటర్నెట్ నిషేధాన్ని జనవరి 8 వరకు పొడిగించినట్లు యూనియన్ టెరిటరి అడ్మినిస్ట్రేషన్ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వులలో పేర్కొంది.

"ఇంటర్నెట్ స్పీడ్ 2జికి పరిమితం చేసినట్లు తెలిపింది. అయితే గండెర్బల్, ఉధంపూర్ జిల్లాలకు ఈ నిషేధం నుండి  మినహాయింపు కల్పించగా, మొబైల్ ఇంటర్నెట్ కనెక్టివిటీకి  స్పీడ్ కు సంబంధిత పరిమితులు లేకుండా అందుబాటులో ఉంచడం కొనసాగించాలి" అని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

"ఈ నిషేధం ఆదేశాలు 26 డిసెంబర్ 2020  నుండి 8 జనవరి 2021 వరకు అమలులో ఉంటుంది" అని వెల్లడించింది.

also read టిక్‌టాక్‌లో ఉన్న మజా వేరే యాప్స్ లో లేదు.. ఒకప్పటి టిక్‌టాక్ స్టార్లు ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా ? ...

దేశ సరిహద్దు మీదుగా పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు చొరబడటానికి ప్రయత్నిస్తున్నారని దీనిపై విశ్వసనీయ సమాచారం ఉందిని హై-స్పీడ్ ఇంటర్నెట్‌లోని ప్రయత్నాలకు ఆటంకం కలిగించిందని ఆర్డర్ పేర్కొంది.

రాజకీయ పార్టీల భాగస్వామ్యాన్ని ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలను ఉదహరించింది.ఎన్నికల ప్రక్రియ ముగిసినప్పటి నుండి ఉగ్రవాదులు గ్రెనేడ్లు వేయడం, దేశ పౌరులు, పోలీసు సిబ్బంది, భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకున్నారని ఉత్తర్వులో పేర్కొంది.

ఆర్టికల్ 370ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తరువాత ఈ ప్రాంతంలో భద్రతా సమస్యల దృష్ట్యా గత ఏడాది ఆగస్టు 5న జమ్మూ కాశ్మీర్‌లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. కేంద్ర ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్, లడఖ్ యూనియన్ టేరిటరీస్ (యుటి)గా  విభజించింది. అక్టోబర్ 31 నుండి  కొత్త యూనియన్ టేరిటరీలు అమల్లోకి వచ్చాయి.