మీరు స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీని కొనాలని ఆలోచిస్తుంటే, మీ బడ్జెట్ 15వేల రూపాయల కన్నా తక్కువ ఉంటే ఈ వార్త మీకు ఎంతో ఉపయోగపడుతుంది. బడ్జెట్ ధరకే లభించే నాలుగు స్మార్ట్ ఎల్‌ఈ‌డి టీవీలు ఏవో మీకు తెలుసా,  ఇందులో 32 అంగుళాల హెచ్‌డి స్క్రీన్, ఓ‌టి‌టి యాప్స్ తో పాటు అనేక హైటెక్ ఫీచర్లను కూడా ఉన్నాయి. ఈ టీవీలలో మీరు మంచి పిక్చర్ క్వాలిటితో అద్భుతమైన సౌండ్ అనుభవాన్ని కూడా పొందుతారు.  


ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఎల్జీ నుండి ఎంట్రీ లెవల్ బడ్జెట్ స్మార్ట్ టీవీ 32 అంగుళాల డిస్ ప్లే తో వస్తుంది. దీని ధర రూ .14,999. ఈ టీవీ వెబ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ + హాట్‌స్టార్ తో పాటు అనేక ఇతర ఓ‌టి‌టి యాప్స్ అందిస్తుంది. 50Hz రిఫ్రెష్ రేట్‌తో హెచ్‌డి‌ఆర్ డిస్ ప్లే, కనెక్టివిటీ కోసం సెట్-టాప్ బాక్స్‌ను కనెక్ట్ చేయడానికి దీనికి రెండు హెచ్‌డి‌ఎం‌ఐ పోర్ట్‌లు ఉన్నాయి. ఇది కాకుండా గేమింగ్ కన్సోల్లు, ఇతర ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. హార్డ్ డ్రైవ్ లేదా పెన్ డ్రైవ్‌లోకి ప్లగ్ చేయడానికి యూ‌ఎస్‌బి పోర్ట్‌, వై-ఫై, టీవి ముందు 10W అవుట్‌పుట్‌తో రెండు డాల్బీ ఆడియో స్పీకర్లు ఉన్నాయి. 

also read లేటెస్ట్ స్మార్ట్ ఫీచర్స్ తో గార్మిన్ ఫోర్రన్నర్ 745 వాచ్ లాంచ్.. ...

 శామ్‌సంగ్ స్మార్ట్ టీవీ  32 అంగుళాల డిస్ ప్లే తో వస్తుంది. దీని ధర రూ .14,999. ఈ టీవీ శామ్‌సంగ్ టీజెన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తుంది. ఇందులో చాలా ఓ‌టి‌టి  యాప్స్ అందుబాటులో ఉన్నాయి. స్క్రీన్-మిర్రరింగ్ ఫీచర్ కూడా అందించారు. పర్సనల్ కంప్యూటర్‌ను కనెక్ట్ చేయడానికి కూడా సపోర్ట్ చేస్తుంది. 60Hz రిఫ్రెష్ రేట్‌తో హెచ్‌డి‌ఆర్ 10 స్క్రీన్‌, రెండు హెచ్‌డిఎంఐ పోర్ట్‌లు, ఒక యుఎస్‌బి పోర్ట్ ఉన్నాయి. ఇందులో 20W  డాల్బీ డిజిటల్ ప్లస్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ స్పీకర్ అవుట్పుట్ కూడా ఉంది.


వై సిరీస్‌తో జూలై 2020లో బడ్జెట్ టీవీ విభాగంలోకి వన్‌ప్లస్ ప్రవేశించింది. దీని ధర రూ .12,999. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ టీవీ 9 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. దీనికి ఇంటర్నల్ క్రోమ్ కాస్ట్ ఉంది. అలెక్సాతో కూడా అందించారు. 60Hz రిఫ్రెష్ రేట్ డిస్ ప్లే, రెండు హెచ్‌డిఎంఐ పోర్ట్‌లు, రెండు యుఎస్‌బి పోర్ట్‌లు ఉన్నాయి. దీని రిమోట్‌లో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్, గూగుల్ అసిస్టెంట్ డెడికేటెడ్ బటన్ ఉన్నాయి. ఇందులో 20W బాక్స్ స్పీకర్, డాల్బీ ఆడియో సిస్టమ్ అందించారు.


షియోమికి చెందిన ఎం‌ఐ టివి 4ఎ ప్రో స్మార్ట్ టివి ధర రూ .12,999.  ఆండ్రాయిడ్ టీవీ 9.0 ప్యాచ్‌వాల్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడుస్తుంది. డేటా సేవర్ మోడ్ కూడా ఇందులో అందుబాటులో ఉంది. దీనికి రెండు యుఎస్‌బి పోర్ట్‌లు, మూడు హెచ్‌డిఎంఐ పోర్ట్‌లు ఉన్నాయి. ఎం‌ఐ టివి 4ఎ ప్రోలో డాల్బీ ప్లస్ డిటిఎస్ హెచ్‌డితో 20W సౌండ్ అవుట్‌పుట్‌  ఉంది.  నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు గూగుల్ అసిస్టెంట్ డెడికేటెడ్ బటన్ కూడా ఇచ్చారు.