భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా గూగుల్ సర్వర్లు మొరాయించాయి. ఏదో ఒకటి బ్రౌజ్ చేద్దామని ప్రయత్నిస్తున్న వారిని ఓ కోతి బొమ్మ వెక్కిరిస్తోంది. గూగుల్ సెర్చింజిన్, జీమెయిల్, యూట్యూబ్‌, డాక్స్, ఫోటోస్, కాంటాక్ట్స్, హ్యాంగ్ అవుట్స్ ఇలా గూగుల్ సేవలు స్తంభించిపోవడంతో యూజర్లు తలపట్టుకుంటున్నారు.

దీనిపై ట్విట్టర్‌లో గూగుల్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. #GmailDown #YoutubeDown అనే హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండవుతున్నాయి.