Asianet News TeluguAsianet News Telugu

గూగుల్ కొరడా.. ప్లే స్టోర్ నుంచి ఆ యాప్స్ తొలగింపు..

ఇంటర్నెట్ సెర్చింజన్ గూగుల్ కొరడా ఝుళిపించింది. చైనా వ్యతిరేకతతో పాపులరైన మిట్రాన్, ‘రిమూవ్ చైనా యాప్స్’ యాప్‌లను కొన్ని గంటల వ్యవధిలోనే తన ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించి వేసింది. తమ పాలసీకి విరుద్ధంగా ఉన్నందునే వాటిని తొలగించామని గూగుల్ వెల్లడించింది. 
 

Google Removes Viral Indian App That Deletes Chinese apps
Author
Hyderabad, First Published Jun 4, 2020, 11:30 AM IST

న్యూఢిల్లీ: సెర్చింజన్ ‘గూగుల్’ నిబంధనల, పాలసీ అమలులో నిక్కచ్చిగా ఉంటున్నది. ఇంతకుముందు ‘టిక్‌టాక్’ యాప్‌కు వ్యతిరేక ప్రచారంలో దూసుకెళ్లిన ‘మిట్రాన్’ తన ప్లే స్టోర్ నుంచి తొలిగించి వేసింది గూగుల్. అలాగే చైనా పట్ల వ్యతిరేకతతో ‘రిమూవ్ చైనా యాప్స్’ అంటూ ఏర్పాటైన భారత్ యాప్’ను కూడా తన ప్లే స్టోర్ నుంచి తీసేసింది సెర్చింజన్.

యాంటీ చైనా సెంటిమెంట్ నేపథ్యంలో అనతి కాలంలోనే రిమూవ్ చైనా యాప్స్’ యాప్ పాపులారిటీ పొందింది. థర్డ్ పార్టీ యాప్‌ల ప్రోత్సాహానికి అనుకూలంగా ఈ యాప్ ఉండటంతోపాటు తన పాలసీకి విరుద్ధంగా ఉన్నందునే తొలిగించామని గూగుల్ వెల్లడించింది. ఈ యాప్‌ను రూపొందించిన జైపూర్ వన్ టచ్ యాప్ ల్యాబ్స్ సైతం ‘సెర్చింజన్’ నిర్ణయాన్ని ధ్రువీకరించింది.

కరోనా వైరస్, భారత్-చైనా సరిహద్దుల్లో లడఖ్ వద్ద నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా చైనా వ్యతిరేక సెంటిమెంట్ బలపడింది. దీనికి తోడు హింసను ప్రేరేపించే విధంగా ఫైజల్ సిద్దిఖీ అనే టిక్ టాక్ యాప్ వినియోగదారుడు చేసిన వీడియోతో చైనాకు చెందిన ‘టిక్ టాక’ వీడియోకు సెగ తగిలి దాని రేటింగ్ దారుణంగా పడిపోయింది. 

అయితే సెర్చింజన్ గూగుల్ పుణ్యమా? అని టిక్ టాక్ కు వ్యతిరేకంగా వచ్చిన వ్యూలన్నీ తొలిగించి వేయడంతో తిరిగి పుంజుకున్నది. ఈ పరిస్థితుల్లోనే గత నెల 17వ తేదీన గూగుల్ ప్లే స్టోర్‌లోకి ‘రిమూవ్ చైనా యాప్స్’ అడుగు పెట్టింది. 

also read ఫేస్‌బుక్ సి‌ఈ‌ఓకి సొంత సిబ్బంది నుంచే వ్యతిరేకత...కారణం ?

తక్కువ టైంలోనే ‘రిమూవ్ చైనా యాప్స్’ యాప్ 50 లక్షల డౌన్ లోడ్లు సొంతం చేసుకుని అత్యధికంగా 4.9 రేటింగ్ సాధించింది. ఫోన్‌లో ఉన్న చైనా యాప్స్ గుర్తించి వాటిని తొలగించడానికి ఈ యాప్ చర్యలు చేపడుతూ ఉంటుంది. ఇది నిబంధనలకు విరుద్ధం కావడంతో గూగుల్ దీన్ని తొలగించింది వేసింది. 

అయితే, ఏ యాప్ నూ తొలగించడం తమ ఉద్దేశం కాదని ఈ యాప్‌ను రూపొందించిన జైపూర్ వన్ టచ్ యాప్ ల్యాబ్స్ సెలవిచ్చింది. ఫోన్లలో యాప్‌ల వినియోగదారులను ఎడ్యుకేట్ చేయడం కోసం మాత్రమే దీన్ని రూపొందించామని తెలిపింది.

మరోవైపు టిక్ టాక్ పైన వ్యతిరేకతతోనే ఒక్కసారిగా దూసుకువచ్చిన మిట్రాన్ యాప్‌నూ సెర్చింజన్ తొలగించింది. ప్లే స్టోర్ పాలసీకి విరుద్ధంగా వ్యవహరిస్తుందన్న కారణంతో ఈ యాప్ మీద గూగుల్ వేటు వేసింది. కొన్ని గంటల్లోపే యాంటీ చైనా సెంటిమెంట్ నేపథ్యంలో ప్రజాదరణ పొందిన ఈ రెండు యాప్‌లను గూగుల్ తొలగించడం ఆసక్తికర పరిణామం. 

పాక్‌కు చెందిన టిక్ టిక్ యాప్ తయారీ సంస్థ క్యూబాక్స్ నుంచి 34 డాలర్లకు ’మిట్రాన్‘ యాప్ కొనుగోలు చేసినట్లు వార్తలొచ్చాయి. ఈ విషయాన్ని క్యూబాక్స్ సీఈఓ ఇర్ఫాన్ షేక్ ఇటీవల భారతదేశానికి చెందిన ఓ వార్తా సంస్థకు వెల్లడించారని ఆ కథనాల్లో పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios