టిక్‌టాక్‌కు పోటీగా సరికొత్త యాప్: గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగింపు..ఎందుకంటే ?

టిక్‌టాక్ యాప్‌కు ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చిన మిట్రాన్ యాప్‌కు కష్టాలొచ్చి పడ్డాయి. భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొంటూ గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి మిట్రాన్ యాప్ తొలగించివేసింది. 
 

Google Removed tiktok rival  Mitron yaap From Play Store

న్యూఢిల్లీ: భారత్‌పై సెర్చింజన్ ‘గూగుల్’ అక్కసు వెళ్లగక్కుతోంది. చైనా యాప్ టిక్‌టాక్‌కు పోటీగా వచ్చిన దేశీయ యాప్ మిట్రాన్‌ను గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి తొలగించింది. మన దేశంలో కరోనా మహమ్మారి, భారత్ – చైనా బోర్డర్ ఇష్యూతోపాటు టిక్‌టాక్ యాప్ హింసను ప్రేరేపించేలా ఉండడంతో చైనా వస్తువులను, యాప్స్ వినియోగించకూడదనే నినాదం తెర పైకి వచ్చింది. 

అందుకు మద్దతుగా మన దేశానికి చెందిన టిక్ టాక్ యూజర్లు, చైనా యాప్స్ వినియోగదారులు వాటిని తొలగిస్తున్నారు. చైనా వస్తువుల్ని బ్యాన్ చేయాలని నినదిస్తున్నారు. అయితే టిక్ టాక్‌కు పోటీగా వచ్చిన మిట్రాన్ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. గూగుల్ నిబంధనలకు విరుద్దంగా మిట్రాన్ యాప్ ఉందంటూ చెప్పే ప్రయత్నం చేసింది.

అయితే మిట్రాన్ యాప్ నిర్వాహకులు గూగుల్‌ను సవాల్ చేశారు. తాము గూగుల్ నియమావళిని ఉల్లంఘించ లేదనడానికి తగిన ఆధారాలు ఉన్నాయని మిట్రాన్ యాప్ డెవలపర్స్ స్పందించారు. ఇదిలా ఉంటే కొద్దిరోజుల క్రితం టిక్ టాక్‌ను వ్యతిరేకిస్తూ భారతీయులు రేటింగ్ ఇచ్చారు. 

అయితే, క్యారి మీ న‌టి ఉదంతం, చైనా యాప్ బ‌హిష్క‌ర‌ణ నినాదం‌.. ఈ రెండూ టిక్‌టాక్‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించాయి. ఫ‌లితంగా యాప్ ‌రేటింగ్స్ దారుణంగా ప‌డిపోయాయి‌. ఆ దెబ్బతో 5 రేటింగ్ ఉన్న టిక్ టాక్ యాప్ 1.2 రేటింగ్‌కి చేరింది.

also read స్మార్ట్ ఫోన్లను వదలని కరోనా ప్రభావం..తగ్గిన సేల్స్: తాజా సర్వే

స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో నెగెటివ్ రివ్యూల తొల‌గింపు పేరుతో గూగుల్ టిక్‌టాక్‌కు అండ‌గా నిలిచింది. గూగుల్ యాజమాన్యం భారీ ఎత్తున నెగిటివ్ కామెంట్స్ ను డిలీట్ చేయగా.. చైనా యాప్ రేటింగ్ యథాస్థానాన్ని సొంతం చేసుకుంది.

దీనిక‌న్నా ముందు టిక్‌టాక్ క‌ష్ట‌కాలాన్ని ఉప‌యోగించుకుంటూ స్వ‌దేశీ యాప్ పేరిట‌ 'మిట్రాన్' తెర‌మీద‌కు వ‌చ్చింది. దీంతో అప్ప‌టికే చైనాపై వ్య‌తిరేక‌త ఉన్న నెటిజ‌న్లు పెద్ద ఎత్తున ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేశారు. త‌క్కువ కాలంలోనే దీని డౌన్‌లోడ్‌ల సంఖ్య 5 మిలియ‌న్లు దాటిపోయింది. 4.7 రేటింగ్‌తో తిరుగులేని యాప్‌గా మిట్రాన్ నిలిచింది. 

ఇలా అవాంతరాలు లేకుండా దూసుకుపోతున్న మిట్రాన్‌కు గూగుల్ స‌డ‌న్‌గా షాకిచ్చింది.  భ‌ద్ర‌తా స‌మ‌స్య‌ల కార‌ణంగా ప్లే స్టోర్‌లో మిట్రాన్ యాప్‌ను తొల‌గించిన‌ట్లు గూగుల్ పేర్కొంది. సైబ‌ర్ నిపుణులు సైతం విని‌యోగ‌దారుల వివ‌రాలు గోప్యంగా ఉంచేందుకు యాప్ డెవ‌లప‌ర్స్ ఎటువంటి భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటించ‌లేద‌ని తెలిపారు.

వీలైతే యాప్‌ను డిలిట్ చేయాల్సిందిగా సైబర్ నిపుణులు కోరారు. కాగా ఈ యాప్‌ను రూర్కే ఐఐటీ విద్యార్థి శిబంక్ అగ‌ర్వాల్ తయారు చేసినట్లు ప్రచారం జ‌రిగింది. 

దీనిపై క్యూబాక్స‌స్ వ్య‌వ‌స్థాప‌కుడు ఇర్ఫాన్‌ షేక్ మాట్లాడుతూ.. 'త‌మ‌ సంస్థ యాప్‌ సోర్స్‌ కోడ్‌ను స‌ద‌రు విద్యార్థికి విక్ర‌యించాం. అత‌ను దాన్ని మిట్రాన్ పేరిట భార‌త్‌లో విడుద‌ల చేశాడు' అని పేర్కొన్న విష‌యం తెలిసిందే. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios