Asianet News TeluguAsianet News Telugu

గూగుల్ ప్లే స్టోర్ నుంచి మరో 5 యాప్స్ ఔట్.. మీరు కూడా వెంటనే వాటిని డిలెట్ చేయండి..

ఒక నివేదిక ప్రకారం, ఈ క్రమబద్ధీకరించని లోన్ యాప్స్ వినియోగదారులకు స్వల్పకాలిక క్రెడిట్‌ను అధిక వడ్డీ రేట్లకు అందిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ యాప్స్ రుణాలు తిరిగి చెల్లించే రుణగ్రహీతలను వేధించటం చేశాయి. జాతీయ దినపత్రిక గూగుల్‌కు పంపిన ప్రశ్నల తరువాత, టెక్నాలజీ దిగ్గజం ఓకే క్యాష్, గో క్యాష్, ఫ్లిప్ క్యాష్, ఇకాష్, స్నాప్‌ఇట్‌లోన్ వంటి ఐదు యాప్‌లను తొలగించింది.

Google play store removes 5 lending applications from play store following complaints
Author
Hyderabad, First Published Nov 24, 2020, 4:00 PM IST

 న్యూ ఢీల్లీ: టెక్ దిగ్గజం గూగుల్ యాప్ డౌన్‌లోడ్ ప్లాట్‌ఫామ్ గూగుల్ ప్లేస్టోర్ నుండి అనధికారిక ఫైనాన్షియల్ రెగ్యులేటరి, డిజిటల్ లోన్ యాప్ లను తొలగించింది. ఈ యాప్స్ మూడు నెలలకు పైగా ప్లేస్టోర్ ప్లాట్‌ఫారమ్‌లో ఉన్నాయి. అయితే ఈ యాప్స్ పేర్లు వినియోగదారులను గందరగోళపరిచే చట్టబద్ధమైన సంస్థల పేర్లతో పోలి ఉన్నాయి.

ఒక నివేదిక ప్రకారం, ఈ క్రమబద్ధీకరించని లోన్ యాప్స్ వినియోగదారులకు స్వల్పకాలిక క్రెడిట్‌ను అధిక వడ్డీ రేట్లకు అందిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ యాప్స్ రుణాలు తిరిగి చెల్లించే రుణగ్రహీతలను వేధించటం చేశాయి.

జాతీయ దినపత్రిక గూగుల్‌కు పంపిన ప్రశ్నల తరువాత, టెక్నాలజీ దిగ్గజం ఓకే క్యాష్, గో క్యాష్, ఫ్లిప్ క్యాష్, ఇకాష్, స్నాప్‌ఇట్‌లోన్ వంటి ఐదు యాప్‌లను తొలగించింది.

ఇటువంటి  యాప్స్ పై అధ్యయనం చేసిన ఫిన్‌టెక్ పరిశోధకుడు శ్రీకాంత్ ఎల్‌ మాట్లాడుతూ “ప్రజలకు త్వరగా నగదు అవసరమైనప్పుడు లక్ డౌన్ సమయంలో ఇటువంటి అనధికార యాప్స్ పెరిగాయి. యాప్స్ పేర్లు చట్టబద్ధమైన కంపెనీల యాప్స్ పేర్లతో పోలి ఉంటాయి.

చాలా మంది రెండింటి మధ్య తేడాను ఎలా గుర్తించాలో తెలియదు. వాటిని కనీసం 4 లక్షల నుండి 10 లక్షల మంది డౌన్‌లోడ్ చేశారు.ఈ యాప్స్ లో ఒక సాధారణ ఫీచర్ ఏమిటంటే వారికి భారతదేశంలో చట్టపరమైన సంస్థ లేదు.

also read  టిక్‌టాక్‌ సెన్సేషన్.. 10కోట్ల ఫాలోవర్స్‌తో అదరగొడుతున్న 16 ఏళ్ల అమ్మాయి.. ...

ఈ లావాదేవీలన్నీ ఆర్‌బిఐ రెగ్యులేటరీ పరిధికి వెలుపల ఉన్నందున కొంత డబ్బు దీని ద్వారా లాండర్‌ అయ్యే అవకాశం ఉంది. వారు గ్రీవెన్స్ ఆఫీసర్ నంబర్లను కూడా లిస్ట్ చేయలేదు, ప్లే స్టోర్ లో లిస్ట్ చేసిన వాలిడిటీ చిరునామా కూడా లేదు. " అని తెలిపారు.


గూగుల్ ప్రతినిధి మాట్లాడుతూ, "మా గూగుల్ ప్లే డెవలపర్ విధానాలు వినియోగదారులను రక్షించడానికి, వారిని సురక్షితంగా ఉంచడానికి రూపొందించబడ్డాయి. మోసపూరితమైన, దోపిడీ చేసే వ్యక్తిగత రుణ నిబంధనల నుండి ప్రజలను రక్షించడంలో సహాయపడటానికి మేము ఇటీవల మా ఆర్థిక సేవల విధానాన్ని విస్తరించాము. ఏదైనా ఉల్లంఘనలు కనుగొనబడినప్పుడు, మేము వాటిపై చర్య తీసుకుంటాము, " అని అన్నారు.

గూగుల్ విధానాల ప్రకారం, ఏదైనా యాప్ "ఆర్థిక ఉత్పత్తులు, సేవలను కలిగి ఉంటే లేదా ప్రోత్సహిస్తే", అది ఒక ప్రాంతం లేదా దేశానికైనా, రాష్ట్ర , స్థానిక నిబంధనలకు లోబడి ఉండాలి. ఈ యాప్స్ తమ సర్వర్‌లను చైనా కంపెనీ అలీబాబా క్లౌడ్‌లో హోస్ట్ చేశాయని శ్రీకాంత్ పరిశోధనలో వెల్లడైంది.

ఈ యాప్స్ గోప్యతాకి ముప్పు. ఈ యాప్స్ అవసరమైన దానికంటే ఎక్కువ అనుమతులు కోరినట్లు శ్రీకాంత్ తెలిపారు, మరికొందరికి వినియోగదారుల స్మార్ట్‌ఫోన్ గ్యాలరీలకు కూడా అక్సెస్ ఇస్తుంది, దీని వల్ల వారి ప్రైవేట్ డేటాను ప్రమాదంలో పడేస్తుంది.  

ప్లేస్టోర్ నుండి తొలగించడం పక్కన పెడితే, ఈ యాప్స్ ప్రభావాన్ని తగ్గించే ఏకైక మార్గం అవగాహన, మెరుగైన నియంత్రణ, డిజిటల్ అక్షరాస్యత.

Follow Us:
Download App:
  • android
  • ios