గూగుల్ ప్లే మ్యూజిక్ అక్టోబర్ నుండి ఇండియాతో సహ ప్రపంచంలోని ఇతర దేశాలలో నిలిపివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. గూగుల్ ప్లే మ్యూజిక్ యూజర్లు తమ కంటెంట్‌ను యూట్యూబ్ మ్యూజిక్‌కు ట్రాన్స్ఫర్ చేయడానికి డిసెంబర్ వరకు అందుబాటులో ఉంటుంది.

గూగుల్ ప్లే మ్యూజిక్ యూసర్లు  కంటెంట్‌ను ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రత్యేక ఆప్షన్ ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు తెలిపింది. టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ప్లే స్టోర్, మ్యూజిక్ మేనేజర్‌లో మార్పులు చేస్తున్నట్లు తెలిపింది.

గూగుల్ ప్లే మ్యూజిక్ సేవను యూట్యూబ్ మ్యూజిక్ ద్వారా భర్తీ చేస్తామని యూట్యూబ్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో ప్రకటించింది. ఇందుకోసం డిసెంబర్ 2020 వరకు సమయాన్ని అందించింది. 

also read అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్లే ఆఫర్లు.. కొద్ది రోజులు మాత్రమే.. ...

ఈ సమయంలో గూగుల్ ప్లే మ్యూజిక్ యూసర్లు తమ కంటెంట్‌ను ప్లే లిస్ట్, మ్యూజిక్ లైబ్రరీ, పర్సనల్ ఇంట్రెస్ట్ సాంగ్స్   యూట్యూబ్ మ్యూజిక్‌కు ట్రాన్స్ఫర్ చేయవచ్చు. గూగుల్ ప్లే మ్యూజిక్ యూసర్ లైబ్రరీలు డిసెంబర్ 2020 తర్వాత అందుబాటులో ఉండవని గుర్తుంచుకోవాలి.  

 గూగుల్ ప్లే మ్యూజిక్ యూజర్లు రాబోయే నెలల్లో గూగుల్ ప్లే మ్యూజిక్ యాప్ నుండి స్ట్రీమ్  చేయలేరు, ఉపయోగించలేరు అని గూగుల్ ప్రకటించింది. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలోని యూసర్లు సెప్టెంబర్ నుండి ఈ యాప్ ఉపయోగించలేరు. భారతదేశంతో సహా ఇతర ప్రపంచ దేశాలలో అక్టోబర్ నుండి యాప్ యాక్సెస్ చేయలేరు.