గూగుల్ పిక్సెల్ కొత్త బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌.. 5జీ మోడల్‌ కూడా త్వరలో విడుదల చేసే చాన్స్‌..

గూగుల్ పిక్సెల్ 4ఎ 5జి మోడల్, పిక్సెల్ 5 స్మార్ట్ ఫోన్ వెల్లడించింది. ఈ రెండు మోడల్స్ ఈ రోజు లాంచ్ అవుతాయని భావిస్తున్నారు. ఈ సంవత్సరంలో గూగుల్ పిక్సెల్ 4ఎ ఎక్స్‌ఎల్‌ను విడుదల చేయకపోవచ్చని  సమాచారం.

Google Pixel 4a Price, Specifications Leak Ahead of Launch Today

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ లేటెస్ట్ ఫీచర్లతో  పిక్సెల్ 4ఎ ఈ రోజు లాంచ్ చేయనున్నట్టు తెలుస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు, ధర కూడా ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. గూగుల్ పిక్సెల్ 4ఎ 5జి మోడల్, పిక్సెల్ 5 స్మార్ట్ ఫోన్ వెల్లడించింది. ఈ రెండు మోడల్స్ ఈ రోజు లాంచ్ అవుతాయని భావిస్తున్నారు.

ఈ సంవత్సరంలో గూగుల్ పిక్సెల్ 4ఎ ఎక్స్‌ఎల్‌ను విడుదల చేయకపోవచ్చని  సమాచారం.


గూగుల్ పిక్సెల్ 4ఎ ధర, ఫీచర్లు
పిక్సెల్ 4ఎ స్మార్ట్ ఫోన్ పై లీక్ అయిన సమాచారం ప్రకారం టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ లాంచ్‌కు ముందే డివైజ్ పూర్తి స్పెసిఫికేషన్ వివరాలు, ధరలను లీక్ చేసింది. యు.ఎస్ మార్కెట్లో 6 జిబి ర్యామ్, 128 జిబి మోడల్ ధర $ 349 (సుమారు రూ. 26,100) గా ఉంది.

also read ఆపిల్‌, శాంసంగ్ మొబైల్‌ ఫోన్ల తయరీ ఇక లోకల్‌.. ...

స్పెసిఫికేషన్లలో 5.51-అంగుళాల పూర్తి-హెచ్‌డి ప్లస్ హోల్-పంచ్ ఓ‌ఎల్‌ఈ‌డి  డిస్ ప్లే, హెచ్‌డి‌ఆర్ సపోర్ట్ కూడా ఉండవచ్చు. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 730 జితో పనిచేస్తుంది. 3,140 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఇందులో అమర్చారు. 12.2-మెగాపిక్సెల్ డ్యూయల్ పిక్సెల్ ఫేస్ డిటెక్షన్ బ్యాక్ కెమెరా f / 1.7 ఎపర్చరు, ఓ‌ఐ‌ఎస్ , 77-డిగ్రీల వ్యూ ఉన్నట్లు నివేదించింది.

ముందు వైపు, సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఎఫ్ / 2.0 ఎపర్చరుతో, 84-డిగ్రీల ఫీల్డ్ వ్యూతో ఉంటుంది. కెమెరా ఫీచర్లు 4కే 30ఎఫ్‌పి‌ఎస్ వీడియో రికార్డింగ్, 1080పి 120ఎఫ్‌పి‌ఎస్ రికార్డింగ్‌ను కలిగి ఉంటాయి.

అదనంగా పిక్సెల్ 4ఎ 144x69.4x8.2 ఎం‌ఎం సైజ్, 143 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. ఈ ఫోన్ లాక్ స్క్రీన్ కోసం ఆల్వేస్ ఆన్ డిస్ ప్లే, నౌ ప్లేయింగ్ ఫీచర్లు, టైటాన్ ఎమ్ సెక్యూరిటీ మాడ్యూల్ ఉంటుందని భావిస్తున్నారు.

ఈ ఫోన్ యుఎస్, యుకె, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, జపాన్, కెనడాలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం భారతదేశంలో లభ్యత గురించి  వివరాలు లేవు. పిక్సెల్ 4ఎ 5జి మోడల్‌ ధర $ 499 (సుమారు రూ. 37,300) కు లాంచ్ అవుతుందని అగర్వాల్ చెప్పారు. అయితే పిక్సెల్ 5 లాంచ్ ఈవెంట్ సందర్భంగా లాంచ్ అవుతుంది అని తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios