వాషింగ్టన్‌: సాధారణంగా ఫోటోస్, వీడియోస్ ఫోన్ నుండి గూగుల్ డ్రైవ్  కి సింక్ చేస్తుంటాము. ఏనుకంటే ఒకవేళ ఫోన్ పోయిన డాటా మాత్రం భద్రంగా గూగుల్ డ్రైవ్ లో ఉంటుంది.

అయితే తాజాగా క్లౌడ్ స్టోరేజ్ సర్వీస్, గూగుల్ వన్ మీ డాటాను ఫ్రీగా బ్యాక్‌అప్‌ చేయనుంది. మొదట గూగుల్ వన్  2018లో లాంచ్ చేసింది, ఇప్పుడు గూగుల్ ఖాతాతో ఉచితంగా ఐ‌ఓ‌ఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లలోని డేటాను ఉచితంగా  బ్యాకప్ చేయవచ్చు.

 

also read కొత్త ఐఫోన్లను రిలీజ్‌ చేయట్లేదు: యాపిల్‌ చీఫ్ ...

ఐ‌ఓ‌ఎస్ యాప్ ఫోటోలు, వీడియోలు, ఇతర డేటాను కూడా బ్యాకప్ చేసుకోవచ్చు, అయితే ఇప్పటికే బ్యాకప్ ఫీచర్ ఉన్న ఆండ్రాయిడ్ యాప్ ఇప్పుడు గూగుల్ వన్ సభ్యత్వం లేకుండా బ్యాకప్‌ చేసుకోవడానికి సహాయపడుతుంది.

బ్యాకప్ ఫీచర్‌తో పాటు మొబైల్‌లో స్టోర్‌ అయిన ఫైల్‌ల నిర్వహణను గూగుల్‌ వన్‌ సులభతరం చేయనుంది.  ఈ స్టోరేజ్‌ మేనేజ్‌మెంట్‌ సౌకర్యం మొబైల్స్‌తో పాటు వెబ్ ప్లాట్‌ఫామ్‌లకు కూడా అందుబాటులో ఉంటుంది. ఇది జిమెయిల్, ఫోటోలు డ్రైవ్ నుండి ఫైల్‌లను ఒకే చోట సేవ్ చేయడానికి వినియోగదారులకు వీలు కల్పిస్తుంది.