సెర్చింజన్ గూగుల్ యజమాన్యంలోని వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ గూగుల్ మీట్ ఒక కొత్త ఫీచర్ ను  తీసుకొచ్చింది. కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో  వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ ఫార్మ్ లకి వినియోగం పెరగటంతో గూగుల్ సంస్థ గూగుల్ మీట్ యాప్ లాంచ్ చేసింది.

జూమ్, జియో మీట్ యాప్ లకు పోటీగా గూగుల్ మీట్ యాప్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం విద్యార్ధుల కోసం ఆన్ లైన క్లాసులను లేదా వీడియో  కాల్స్ దృష్టిలో పెట్టుకొని కొత్త ఫీచర్ ను  తీసుకొచ్చారు.

వీడియో కాల్ లో ఉన్నపుడు శబ్దాలను ఫిల్టర్ చేసి నాయిస్ ను తగ్గించి సౌండ్ క్వాలిటీని పెంచగల అధ్భూతమైన ఫీచర్ ను ప్రవేశపెట్టింది. ఈ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ లో విడుదల చేసింది.

also read 

అంతే కాకుండా స్కూల్స్, విద్యార్థులకు అవసరమయ్యే మరిన్ని ఫీచర్స్ పై గూగుల్ దృష్టి సారించింది. గూగుల్ మీట్ లో క్లాసులు వినే విద్యార్థుల కోసం అటెండెన్స్ రిపోర్ట్ ఫీచర్ను అభివృద్ధి చేయనుంది.  

యూసర్లు రోడ్డు పక్కన, హోటళ్ల వద్ద, బయట ఎక్కడ ఉన్న కూడా ఈ ఫీచర్ సాయంతో ఎలాంటి నాయిస్ లేకుండా కాల్స్ చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. సాధారణంగా కీబోర్డ్ టైపింగ్, డోర్స్ సౌండ్ వంటి శబ్దాలను ఈ ఫీచర్ నిరోధిస్తుంది.

సౌండ్ ఫిల్టర్ ఫీచర్ ద్వారా కాల్స్ అంతరాయం లేకుండా మాట్లాడుకోవచ్చు. కాల్ మాట్లాడేటప్పుడు వాయిస్ నుంచి అనవసర శబ్దాలను వేరుచేసేందుకు గూగుల్ స్పెషల్  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపొందించింది.

ఈ ఫీచర్ అందరికీ అందుబాటులో ఉండదని గూగుల్ తెలిపింది.  ప్రస్తుతం జీ సూట్ ఎంటర్ప్రైజ్, జీ సూట్ ఎంటర్ప్రైజ్ ఫర్ ఎడ్యుకేషన్ కస్టమర్లకే ఈ నాయిస్ క్యాన్సిలేషన్ అప్ డేట్ లభిస్తుంది. జీ సూట్ బేసిక్, జీ సూట్ బిజినెస్, జీ సూట్ ఫర్ నాన్ ప్రాఫిట్ అకౌంట్లకు ఈ ఫీచర్ అందుబాటులో లేదు.