గూగుల్ మ్యాప్స్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్ లో మరో లేటెస్ట్ ఫీచర్.. కోవిడ్-19 సమాచారం పై రియల్ టైమ్ అప్ డేట్..
గూగుల్ మ్యాప్స్ యాప్ తాజా వెర్షన్ లో మెరుగైన కోవిడ్-19 సమాచారం అందిస్తుంది, ఇది రద్దీగా ఉండే ప్రదేశంలో సామాజిక దూరం పాటించడానికి సహాయపడుతుంది. ఇందుకోసం యాప్ లో రద్దీగా ఉన్న ప్రదేశాల సమాచారాన్ని చూపిస్తుంది. స్థానిక అధికారుల నుండి కోవిడ్-19 తాజా కేసుల వివరాలను ఇందులో ఎప్పటికప్పుడు అందిస్తుంది.
గూగుల్ మ్యాప్స్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్ కోసం గూగుల్ కొత్త అప్ డేట్ ప్రకటించింది. గూగుల్ మ్యాప్స్ యాప్ తాజా వెర్షన్ లో మెరుగైన కోవిడ్-19 సమాచారం అందిస్తుంది, ఇది రద్దీగా ఉండే ప్రదేశంలో సామాజిక దూరం పాటించడానికి సహాయపడుతుంది.
ఇందుకోసం యాప్ లో రద్దీగా ఉన్న ప్రదేశాల సమాచారాన్ని చూపిస్తుంది. స్థానిక అధికారుల నుండి కోవిడ్-19 తాజా కేసుల వివరాలను ఇందులో ఎప్పటికప్పుడు అందిస్తుంది. అదనంగా గూగుల్ మ్యాప్స్ యాప్ భారతదేశం, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రెజిల్, యుఎస్ లో టేకౌట్, డెలివరీ ఆర్డర్ల లైవ్ స్టేటస్ కూడా చూపిస్తుంది.
వినియోగదారులు యాప్ నుండి ఏదైనా బుక్ చేసినప్పుడు లేదా ఆర్డర్ చేసినప్పుడు ఈ ఫీచర్ పనిచేస్తుంది. అయితే ఈ అప్ డేట్ ప్రస్తుతం పరిమిత వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉందని తెలుస్తుంది, రాబోయే రోజుల్లో మరింత వినియోగదారులకు అందుబాటులోకి రావోచ్చని భావిస్తున్నారు.
కరోనా మహమ్మారి వ్యాప్తి మధ్య కొత్త ప్రాంతాల కోసం నావిగేట్ చేస్తున్నప్పుడు వారికి ఉపయోగపడే సాధనంగా ఈ ఫీచర్ ఉంటుందని సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్ తెలిపింది. ఈ ఫీచర్ అక్సెస్ చేయడానికి, వినియోగదారులు మ్యాప్‌లలోని సెర్చ్ టాబ్ కింద ఉన్న బటన్‌ను క్లిక్ చేసి, కోవిడ్-19 సమాచారం ఆప్షన్ ఎంచుకోవాలి.
also read భారీ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పోకో ఏం సిరీస్ కొత్త స్మార్ట్ ఫోన్ ...
తాజాగా, గూగుల్ మ్యాప్స్ లైవ్ ట్రాన్సిట్ “క్రౌడ్నెస్(జనసమూహం)” డేటా అనే ఫీచర్ తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మీరు ప్రయాణిచాలనుకుంటున్న దారిలో ప్రజారవాణాకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తుంది. అంటే బస్సులు, రైళ్లు మరియు సబ్‌వే వంటి వాటిలో ఎక్కువ మంది ఎందులో ప్రయాణిస్తున్నారనేది మీకు ఇట్టే తెలిసిపోతుంది.
దాని వల్ల మీరు మరో ప్రత్యామ్నాయం మార్గంలో ప్రయాణించొచ్చు. ఈ సమాచారం అంతా మీకు గూగుల్ మ్యాప్స్ లో ప్రజలు ఇచ్చే ఫీడ్ బ్యాక్, వారి లైవ్ స్టేటస్ ఆధారంగా తెలియజేస్తునట్లు గూగుల్ తెలిపింది. ఈ సమాచారం ఎక్కువ రద్దీగా ఉండే ప్రాంతాలలో లభిస్తుంది కావున అన్ని ప్రాంతాల్లో ఇది అందుబాటులో ఉండకపోచ్చని తెలిపింది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇది పనిచేస్తుందని వెల్లడించింది.
గూగుల్ మ్యాప్స్‌లో వస్తున్న మరో ఫీచర్ టేకౌట్ లైవ్ స్టేటస్, ఫుడ్ డెలివరీలను ట్రాక్ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. వినియోగదారులకు ఆర్డర్ వైటింగ్ సమయం, డెలివరీ ఫీజులను కూడా తెలుసుకోవచ్చు.
గూగుల్ మ్యాప్స్‌లో గూగుల్ అసిస్టెంట్ డ్రైవింగ్ మోడ్‌ను కూడా రూపొందిస్తోంది, అయితే ఇది యుఎస్‌లోని వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. భారతదేశంలో ఈ ఫీచర్ లభ్యతపై కంపెనీ ఇంకా వివరాలను వెల్లడించలేదు.
గూగుల్ మ్యాప్స్‌లో నేరుగా అసిస్టెంట్ ఫీచర్ ద్వారా కాల్స్ తీసుకోవడానికి లేదా మ్యూజిక్ మార్చడానికి వాయిస్ కమాండ్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను కంట్రోల్ చేయడానికి అసిస్టెంట్ డ్రైవింగ్ మోడ్ వినియోగదారులకు సహాయపడుతుంది. ఈ ఫీచర్ కోసం వినియోగదారులు ఆండ్రాయిడ్ ఫోన్‌లోని అసిస్టెంట్ సెట్టింగ్‌లకు వెళ్లాలి> సెలెక్ట్ గెట్టింగ్ అరౌండ్ > డ్రైవింగ్ మోడ్‌ను ఎంచుకుంటె సరిపోతుంది.