గూగుల్ పాపులర్ బ్రౌజర్ క్రోమ్ 2020 సంవత్సరానికి లాంచ్ చేసింది. పర్ఫర్మెంస్, ఫీచర్స్ పరంగా బ్రౌజర్ కొన్ని ప్రధాన అప్ డేట్స్ అందించింది. కొత్త అప్ డేట్ క్రోమ్ బ్రౌజర్  వేగంగా ఓపెన్, లోడ్ చేయడానికి, ఎక్కువ బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.

ఫీచర్స్ పరంగా క్రోమ్ బ్రౌజర్ సెర్చ్ బార్ నుండి కీ సెట్టింగ్ ఆప్షన్స్ తో పాటు అన్ని ఓపెన్ క్రోమ్ విండోస్ అంతటా సెర్చ్ ట్యాబ్‌లను యాక్సెస్ చేయగల సామర్ధ్యం ఉంటుంది. రాబోయే కొన్ని వారాల్లో ఈ ఫీచర్స్ అందుబాటులోకి వస్తాయి.

క్రోమ్ బ్రౌజర్ ఇప్పుడు ఆక్టివ్ ట్యాబ్‌లకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇది సి‌పి‌యూ వినియోగాన్ని 5x వరకు తగ్గించడానికి, బ్యాటరీ లైఫ్ 1.25 గంటల వరకు పొడిగించడానికి సహాయపడుతుందని గూగుల్ పేర్కొంది.

క్రోమ్ బ్రౌజర్ ఇప్పుడు 25% వేగంగా స్టార్ట్ అవుతుంది, అలాగే 7% వరకు పేజీలను వేగంగా లోడ్ చేస్తుంది అని కంపెనీ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

క్రోమ్ బ్రౌజర్ పనితీరులో పెరుగుదల ఉన్నప్పటికీ, బ్రౌజర్ మునుపటి కంటే తక్కువ శక్తిని, ర్యామ్‌ను ఉపయోగిస్తుందని పేర్కొంది. వినియోగదారులు అండ్రాయిడ్ లోని క్రోమ్ బ్రౌజర్ పేజీలను వెనుకకు, ముందుకు నావిగేట్ చేసినప్పుడు పేజీలు ఇన్స్టంట్ లోడ్ చేస్తుందని గూగుల్ పేర్కొంది.

also read వర్క్ ఫ్రమ్ హోం సమయంలో హెడ్ ఫోన్స్ వాడుతున్నారా.. అయితే మీకు కూడా ఈ సమస్య రవొచ్చు.. ...

సెర్చ్ ట్యాబ్స్ 
యూసర్లు ప్రస్తుతం ఉన్న విండోతో సంబంధం లేకుండా ఓపెన్ చేసిన ట్యాబ్‌ల లిస్ట్ చూడగలుగుతారు. ఇంకా వారు అవసరమైన ట్యాబ్‌ను త్వరగా కనుగొనడానికి టైప్ చేయవచ్చు. ఈ ఫీచర్ మొదట క్రోమ్ బుక్ లకు తరువాత త్వరలో ఇతర డెస్క్‌టాప్ ప్లాట్‌ఫామ్‌లకు వస్తోంది. మల్టీ క్రోమ్ విండోస్ ఓపెన్ చేసి ఉన్నప్పటికీ, యూసర్లు ఏ విండోలో ఉన్నా కావల్సిన టాబ్‌ను కనుగొనవచ్చు.

అడ్రస్ బార్ ఫీచర్స్ 
క్రోమ్ బ్రౌజర్ అడ్రస్ బార్ నుండి నేరుగా చర్య తీసుకోవడానికి వినియోగదారుని అనుమతిస్తుంది. కొన్ని కీస్ట్రోక్‌లతో వర్క్ పూర్తి చేయడానికి ఇది వేగవంతమైన మార్గం అని కంపెనీ పేర్కొంది. ఉదాహరణకు: మీరు “ఎడిట్ పాస్‌వర్డ్‌” లేదా “డిలీట్ హిస్టరీ” అని టైప్ చేసినప్పుడు, మీరు ఇప్పుడు నేరుగా అడ్రస్ బార్ నుండి చేయవచ్చు.  

కొత్త ట్యాబ్‌ ఫీచర్స్ 
గూగుల్ త్వరలో క్రోమ్ లో క్రొత్త ట్యాబ్ పేజీకి కార్డులను జోడిస్తుంది. వాటిపై క్లిక్ చేస్తే యూసర్లు వెబ్‌లో ఇటీవల ఓపెన్ చేసిన లేదా సంబంధిత కంటెంట్‌ చూపిస్తుంది, ఈ ప్రక్రియలో మీ బ్రౌసింగ్ సమయాన్ని ఎంతో ఆదా చేస్తుంది.