Asianet News TeluguAsianet News Telugu

గూగుల్‌ పే యాప్ పై బ్యాన్‌..అలాంటి వాటికి బలైపోవద్దని విజ్ఞప్తి...

తమ యాప్‌ యూపీఐ ద్వారా చెల్లింపుల కోసం బ్యాంకులకు టెక్నాలజీ సర్వీస్‌ ప్రొవైడర్‌గా వ్యవహరిస్తుందని పేర్కొంది. గూగుల్‌ పే ద్వారా జరిగే ప్రతీ లావాదేవి పూర్తిగా సురక్షితమేనని వెల్లడించింది. ఎన్‌పిసిఐ అధీకృత పేమెంట్ వ్యవస్థ ఆపరేటర్ల జాబితాను ఉటంకిస్తూ గూగుల్ పే ఆర్‌బిఐ అనుమతి లేకుండా ఆర్థిక లావాదేవీలను చేస్తోందని దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించాలని సుప్రీంకోర్టు ఆర్‌బిఐని కోరింది. 

Google and NPCI clarifies rumors on google pay app ban in social media
Author
Hyderabad, First Published Jun 27, 2020, 2:14 PM IST

టెక్ మేజర్ గూగుల్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) పేమెంట్ యాప్ గూగుల్ పే ఇంకా ఎన్‌పిసిఐ  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ)  చట్టపరిధిలోనే ఉండి పని చేస్తుందని తేల్చి చెప్పింది.  తమ యాప్‌ యూపీఐ ద్వారా చెల్లింపుల కోసం బ్యాంకులకు టెక్నాలజీ సర్వీస్‌ ప్రొవైడర్‌గా వ్యవహరిస్తుందని పేర్కొంది.

గూగుల్‌ పే ద్వారా జరిగే ప్రతీ లావాదేవి పూర్తిగా సురక్షితమేనని వెల్లడించింది. ఎన్‌పిసిఐ అధీకృత పేమెంట్ వ్యవస్థ ఆపరేటర్ల జాబితాను ఉటంకిస్తూ గూగుల్ పే ఆర్‌బిఐ అనుమతి లేకుండా ఆర్థిక లావాదేవీలను చేస్తోందని దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించాలని సుప్రీంకోర్టు ఆర్‌బిఐని కోరింది.

దీనికి ప్రతిస్పందనగా ఆర్‌బిఐ గూగుల్ పే థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్ అని, అందువల్ల 2007 పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టం చట్టాన్ని ఉల్లంఘించలేదని అన్నారు. గూగుల్ పే ఇండియా ఒక ప్రకటనలో “గూగుల్ పే పూర్తిగా చట్టపరిధిలోనే పనిచేస్తుంది.

యుపిఐ ద్వారా పేమెంట్లను అనుమతించడానికి, భాగస్వామి బ్యాంకులకు టెక్నాలజీ సర్వీస్ ప్రొవైడర్‌గా మేము పని చేస్తున్నాము. దేశంలోని యుపిఐ యాప్స్ 'థర్డ్ పార్టీ యాప్స్' గా పనిచేస్తున్నాయి.

భారత్‌లో గూగుల్‌ పే యాప్‌ను ఆర్‌బీఐ బ్యాన్‌ చేసిందంటూ సోషల్‌ మీడియాలో షికార్లు చేస్తున్న పుకార్లపై నేషనల్‌ పేమెంట్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌పీసీఐ) క్లారిటీ ఇచ్చింది. దీనిపై ఎన్‌పీసీఐ శుక్రవారం స్పందిస్తూ గూగుల్‌ పే యాప్‌ను ఇండియాలో బ్యాన్‌ చేయలేదని, సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది.  

అంతకు క్రితం గూగుల్‌ పే లావాదేవీలపై వచ్చిన పుకార్లపై సంస్థ స్పష్టత నిచ్చింది. కాగా, గూగుల్‌ పే థర్డ్‌ పార్టీ యాప్‌ ప్రొవైడర్‌ మాత్రమేనని, ఇది ఎలాంటి పేమెంట్‌ వ్యవస్థను నిర్వహించదని ఆర్‌బీఐ ఢిల్లీ హైకోర్టుకు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. జాతీయ చెల్లింపుల కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ) ప్రచురించిన అథీకృత చెల్లింపు వ్యవస్థల ఆపరేటర్ల జాబితాలో జీ పే లేదని ఆర్‌బీఐ పేర్కొంది.

అయితే గూగుల్‌ పే కార్యకలాపాలు చెల్లింపులు పరిష్కారాల చట్టం 2007ను ఉల్లంఘించడం లేదని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీఎన్‌ పటేల్‌, జస్టిస్‌ ప్రతీక్‌ జలన్‌లతో కూడిన బెంచ్‌కు ఆర్‌బీఐ నివేదించింది. “యుపిఐ, ఎన్‌పిసిఐ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్ (పిఎస్‌ఓ) గా ఎన్‌పిసిఐకి ఆర్‌బిఐ అధికారం ఇచ్చింది, ఎందుకంటే యుపిఐలో పాల్గొనే వారందరికీ పిఎస్‌ఓ అధికారం ఇస్తుంది.

గూగుల్ పే థర్డ్ పార్టీ యాప్ ప్రొవైడర్ (టిపిఎపి) గా వర్గీకరించబడిందని మేము స్పష్టం చేయాలనుకుంటున్నాము, ఇది చాలా మందికి యుపిఐ పేమెంట్ సేవలను కూడా అందిస్తుంది, ఇంకా బ్యాంకింగ్ భాగస్వాముల ద్వారా పని చేస్తుంది. యుపిఐ వ్యవస్థ పూర్తిగా సురక్షితమైనది, ఇటువంటి హానికరమైన వార్తలకు బలైపోవద్దని మేము మా వినియోగదారులకి విజ్ఞప్తి చేస్తున్నాము. అని తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios