స్మార్ట్‌ఫోన్ రంగంలోకి రీఎంట్రీ : బడ్జెట్ ధరకే జియోనీ కొత్త స్మార్ట్‌ఫోన్
ఒక విధంగా చైనా కంపెనీల ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ కూడా జియోనీ రిఎంట్రీకి కారణం కావొచ్చు. తాజాగా జియోనీ సంస్థ మాక్స్ స్మార్ట్‌ఫోన్ ని భారతదేశంలో లాంచ్ చేసింది.
స్మార్ట్ ఫోన్ రంగంలో ఒక సంవత్సరం విరామం తరువాత మళ్ళీ ఇండియాలో జియోనీ బ్రాండ్ తిరిగి ప్రవేశిస్తుంది. ఒక విధంగా చైనా కంపెనీల ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ కూడా జియోనీ రిఎంట్రీకి కారణం కావొచ్చు. తాజాగా జియోనీ సంస్థ మాక్స్ స్మార్ట్‌ఫోన్ ని భారతదేశంలో లాంచ్ చేసింది.
గతంలో జియోనీ బ్రాండ్ అనేక బేసిక్ మోడల్ నుండి స్మార్ట్ ఫోన్స్ వరకు విక్రయించింది. కొత్త జియోనీ మాక్స్ స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ ప్రాసెసర్, డ్యూయల్ రియర్ కెమెరాతో ఎంట్రీ లెవల్ ధరకు పెద్ద బ్యాటరీతో వస్తుంది. మూడు కలర్ ఆప్షన్స్ తో పాటు సింగీల్ ర్యామ్, స్టోరేజ్ వెరీఎంట్ తో వస్తుంది.
జియోనీ మాక్స్ ధర, లభ్యత
జియోనీ మాక్స్ 2 జిబి ర్యామ్, 32 జిబి స్టోరేజ్ తో వస్తుంది. దీని ధర రూ. 5,999 బ్లాక్, రెడ్, రాయల్ బ్లూ అనే మూడు కలర్ ఆప్షన్స్ లో అందుబాటులోకి రానుంది. జియోనీ మాక్స్ స్మార్ట్ ఫోన్ ఆగస్టు 31 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయిస్తుంది.
also read మొబైల్ సేవల ధరల పెంపు తప్పదు..: నెలకు 1.6 జీబీ మాత్రమే.. ...
జియోనీ మాక్స్ ఫీచర్స్
డ్యూయల్ సిమ్ (నానో), జియోనీ మాక్స్ ఆండ్రాయిడ్ 10తో నడుస్తుంది. దీనిలో 6.1-అంగుళాల హెచ్‌డి + (720x1,560 పిక్సెల్స్) డిస్ప్లే 2.5 డి కర్వ్డ్ గ్లాస్ స్క్రీన్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఆక్టా-కోర్ యునిసోక్ 9863A SoC చేత శక్తినిస్తుంది. ఫోటోలు, వీడియోల కోసం జియోనీ మాక్స్ వెనుక రెండు కెమెరాలు, ముందు భాగంలో ఒకటి ఉన్నాయి.
బ్యాక్ కెమెరా సెటప్‌లో 13 మెగాపిక్సెల్ ప్రాధమిక కెమెరా దానితో పాటు డెప్త్ కెమెరా ఉంటుంది. ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ ఉంచారు. జియోనీ మాక్స్ 32 జిబి ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది, మైక్రో ఎస్‌డి కార్డ్ 256 జిబి వరకు విస్తరించుకోవచ్చు.
5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో రివర్స్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. జియోనీ మాక్స్‌లోని కనెక్టివిటీ ఆప్షన్స్ 4జి ఎల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ 4.2, జిపిఎస్/ఎ-జిపిఎస్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఛార్జింగ్ కోసం మైక్రో-యుఎస్‌బి పోర్ట్ ఉన్నాయి. జియోనీ మాక్స్ 148x70.9x10.75 సైజులో 185 గ్రాముల బరువు ఉంటుంది.