ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఆపిల్ ఇప్పుడు మరోసారి అద్భుతమైన ఆఫర్ ప్రవేశపెడుతోంది. కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగ అన్నీ రంగాలు, వ్యాపారాలు తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. దాదాపు 80 రోజుల లాక్ డౌన్ తరువాత ఆంక్షలతో కూడిన సడలింపుతో మళ్ళీ మళ్ళీ రంగాలు, వ్యాపారాలు తేరుచుకున్నాయి.

అయితే విద్యారంగం పరంగా ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగ లాక్ డౌన్ సమయంలో స్కూల్స్ విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆన్ లైన తరగతులను నిర్వహిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఆపిల్ సంస్థ స్కూల్ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అలాగే అధ్యాపకులు, సిబ్బంది, అన్ని గ్రేడ్ స్థాయిల హోమ్‌స్కూల్ ఉపాధ్యాయుల కోసం అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది.

అదేంటంటే ఆపిల్ ఎడ్యుకేషన్ స్టోర్ ద్వారా క్రొత్త మాక్‌బుక్ లేదా ఐప్యాడ్‌ను కొనుగోలు చేసే వారికి సెకండ్ జనరేషన్ ఎయిర్‌పాడ్‌ సెట్‌ను ఉచితంగా పొందవచ్చు. ఒకవేళ మీరు యు.ఎస్ దేశంలోని విద్యార్ధులయితే మీరు ఎలాంటి ఐడి లేదా సర్టిఫికెట్లను అందించాల్సిన అవసరం కూడా లేదు. కలర్, స్క్రీన్ పరిణామం వంటి ఆప్షన్స్ కూడా ఎంచుకోవచ్చు. ఇందుకోసం మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఏంటంటే..


ఆపిల్ ఫ్రీ ఎయిర్‌పాడ్స్ ఎలా పొందవచ్చు

ఆపిల్ ఎడ్యుకేషన్ స్టోర్‌కు వెళ్లి, మీరు ఆపిల్ కొత్త ప్రోమోల కోసం క్రిందికి స్క్రోల్ చేయండి. ఆఫర్లో భాగంగా ఉన్న  డివైజెస్ లలో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోండీ. ఒకవేళ మీరు యు.ఎస్ నగర వాసులయితే ముందస్తుగా ఎలాంటి ఐడి లేదా సర్టిఫికెట్లను అందించాల్సిన అవసరం లేదు.

ఆపిల్ ఆఫర్ పై ఖచ్చితంగా మీరు అర్హులు కాకపోతే అది  మీకు ఇమెయిల్ ద్వారా తెలియజేస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఒక  సంవత్సరంలో విద్యార్థులు లేదా అధ్యాపకులకు ఈ ఆఫర్ వర్తిస్తుండి అనే దానిపై ఆపిల్‌ పరిమితి కూడా పెట్టింది.

అదనంగా $ 40 డాలర్లు చెల్లించడం ద్వారా వైర్‌లెస్ ఛార్జింగ్ కేసు ఎయిర్‌పాడ్స్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు లేదా $ 90 డాలర్లతో ఎయిర్‌పాడ్స్ ప్రోకు అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశాన్ని కూడా ఆపిల్ మీకు ఇస్తోంది. మీరు సెకండ్ జనరేషన్ స్టాండర్డ్ ఎయిర్‌పాడ్‌ల పై మాత్రమే ఈ ఆఫర్ పొందగలరు.

ఏ ఆపిల్ డివైజెస్ పొందటానికి మీరు అర్హులు?


ఫ్రీ ఎయిర్‌పాడ్‌లను పొందడానికి మీరు కొనుగోలు చేయవలసిన మాక్‌లు, ఐప్యాడ్ లిస్ట్ ఇక్కడ ఉన్నాయి:

21.5-అంగుళాల లేదా 27-అంగుళాల ఐమాక్
27-అంగుళాల ఐమాక్ ప్రో
13.3-అంగుళాల మాక్‌బుక్ ఎయిర్
13.3-అంగుళాల మాక్‌బుక్ ప్రో
16-అంగుళాల మాక్‌బుక్ ప్రో
10.5-అంగుళాల ఐప్యాడ్ ఎయిర్
11-అంగుళాల ఐప్యాడ్ ప్రో 2020
12.9-అంగుళాల ఐప్యాడ్ ప్రో 2020

ఆ ఆఫర్ లిమిటెడ్ ఎడిషన్ మాత్రమే అని ఆపిల్ తెలిపింది. పూర్తి నిబంధనలు, షరతుల కోసం దాని సేల్స్ , రిటర్న్ విధానాన్ని చూడండి ద్వారా మరింత సమాచారం తెలుసుకోవచ్చు.