చైనా యాప్ టిక్‌టాక్‌కు ఊహించని మరో ఎదురు దెబ్బ తాలిగింది. భారత మాజీ అటార్నీ జనరల్, సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి టిక్ టాక్ తరపు న్యాయవాదిగా ఉండటానికి నిరాకరించారు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక చైనా కంపెనీకి ప్రాతినిధ్యం వహించకూడదనుకుంటున్నందున తాను సుప్రీంకోర్టు ముందు టిక్ టాక్ కోసం వాదించలేనని అన్నారు.

భారతదేశంలోని తూర్పు లఢక్‌ సరిహద్దులో ఈ నెల 15న భారత్‌, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో తెలంగాణకు చెందిన కర్నల్‌ తో సహా మరో 20 మంది భారత జవాన్లు అమరులైన నేపథ్యంలో భారత  ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  


టిక్‌టాక్ పూర్తిగా ప్లే స్టోర్ నుండి బ్యాన్ 
భద్రతా సమస్యల కారణంగా ప్రముఖ చైనా వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌ను భారత ప్రభుత్వం నిషేధించింది. మంగళవారం భారతదేశంలోని గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్ నుండి ఈ యాప్ తొలగించారు. అంటే కొత్త వినియోగదారులు ఈ నిషేధాన్ని ఎత్తివేస్తే వరకు దాన్ని డౌన్‌లోడ్ చేయలేరు. అంతేకాదు ఇప్పటికే ఈ యాప్ ఉన్న వినియోగదారులు ఇక నుంచి యాక్సెస్ కూడా చేయలేరు.

also read  మీ ఫోన్ లో టిక్‌టాక్ యాప్ ఉందా..? అయితే జాగ్రత్త.. ...  


చైనీస్ వీడియో షేరింగ్ యాప్ భారతదేశంలో నిషేధం
జాతీయ భద్రత, భారతదేశ రక్షణ, డాటా చోరీ సంబంధిత లోపాలను ఏతి చూపుతూ ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, భారతదేశంలోని ఆపిల్ ఐఓఎస్ యాప్ స్టోర్ల నుండి తొలగించింది. అంతకాదు దీనితో పాటు మరో 58 చైనీస్ యాప్‌లపై కూడా నిషేధాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది.

భారతదేశాన్ని అతిపెద్ద మార్కెట్‌గా భావించే టిక్‌టాక్, అలీబాబా గ్రూప్ నుండి యుసి న్యూస్, సిఎం బ్రౌజర్, ఫైల్ షేరింగ్ సర్వీస్ షేర్ ఇట్, షాపింగ్ యాప్ షెయిన్, పాపులర్ మొబైల్ గేమ్ క్లాష్ ఆఫ్ కింగ్స్ ఇంకా చాలా ఉన్నాయి.

టిక్ టాక్ నిషేధం పై కీలక ప్రకటన విడుదల 

చైనా యాప్స్ నిషేధం తరువాత, టిక్ టాక్  భారత కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది, దీనిలో టిక్ టాక్ డేటా గోప్యత, భద్రతా అవసరాలకు అనుగుణంగా కొనసాగుతోందని, చైనా ప్రభుత్వంతో సహా ఏ విదేశీ ప్రభుత్వానికి వినియోగదారుల సమాచారాన్ని పంచుకోలేదని టిక్ టాక్ హెడ్ నిఖిల్ గాంధీ పేర్కొన్నారు.

ఏదేమైనా, భారతదేశంలో తన సేవలను పునరుద్ధరించాలని టిక్‌టాక్ చేసిన అభ్యర్థనను భారత ప్రభుత్వం అంగీకరించనందున, చైనా యాప్‌ను భారత ప్రభుత్వం నిషేధించడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు టిక్‌టాక్‌ ప్రయత్నిస్తున్నది. దేశం పట్ల తన దేశభక్తిని ప్రదర్శిస్తూ, భారత మాజీ అటార్నీ జనరల్  ముకుల్ రోహత్గి సుప్రీంకోర్టులో చైనా యాప్‌కు ప్రాతినిధ్యం వహించడానికి నిరాకరించారు.