Asianet News TeluguAsianet News Telugu

ఫెస్టివల్ సీజన్‌ కోసం 50 వేల కిరాణా స్టోర్లతో జతకట్టిన ఫ్లిప్‌కార్ట్..

దేశంలోని 850కి పైగా నగరాల్లోని వినియోగదారులకు డెలివరీ చేయడానికి కిరాణా ఆన్‌బోర్డింగ్ కార్యక్రమాన్ని గణనీయంగా విస్తరించిందని కంపెనీ తెలిపింది. 

Flipkart onboards over 50,000 Kirana stores for personalised e-commerce experience in this  festivel  season
Author
Hyderabad, First Published Sep 10, 2020, 1:07 PM IST

న్యూ ఢీల్లీ: ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ సీజన్, బిగ్ బిలియన్ డేస్ కోసం 50వేల కిరణా స్టోర్లను ఆన్‌బోర్డ్ చేసినట్లు బుధవారం తెలిపింది. దేశంలోని 850కి పైగా నగరాల్లోని వినియోగదారులకు డెలివరీ చేయడానికి కిరాణా ఆన్‌బోర్డింగ్ కార్యక్రమాన్ని గణనీయంగా విస్తరించిందని కంపెనీ తెలిపింది.

"50వేల కిరణా దుకాణాలకు పైగా ఆన్‌బోర్డ్ తో ఫ్లిప్‌కార్ట్ మిలియన్ల కస్టమర్లకు వేగవంతమైన ఇ-కామర్స్ అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది" అని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

కిరణా షాపులకు ఆన్‌బోర్డ్‌లో సహాయపడడానికి, ఈ పండుగ సీజన్‌లో ఆక్టివ్ గా పాల్గొనడానికి ఫ్లిప్‌కార్ట్ బృందం ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌ ద్వారా కిరణా స్టోర్స్ కోసం కాంటాక్ట్‌లెస్ ఆన్‌బోర్డింగ్‌ను ప్రారంభించింది.

అంటే కిరణ స్టోర్ భాగస్వాములు అవసరమైన డాక్యుమెంటేషన్‌తో పాటు నేరుగా వివరాలను అప్‌లోడ్ చేయవచ్చు. కోవిడ్-19 సమయాల్లో కస్టమర్లు ఇంటి నుండి బయటికి అడుగు పెట్టకుండ ఫ్లిప్‌కార్ట్ డెలివరీలు అందించింది.

also read బోట్‌ కొత్త వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్లు.. ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు.. ...

ఆన్‌లైన్ అప్లికేషన్ తనిఖీ తరువాత, కిరానా భాగస్వాములు సరుకులను పంపిణీ చేయవచ్చు. యాప్-బేస్డ్ డాష్‌బోర్డ్‌లు, డిజిటల్ పేమెంట్ సహా వివిధ వాటిపై  ఫ్లిప్‌కార్ట్  బృందం డిజిటల్ ట్రైనింగ్ కూడా నిర్వహిస్తుంది, తద్వారా దుకాణాలకు తమ వ్యాపారాన్ని డిజిటల్ పేమెంట్ లోకి మార్చడానికి సహాయపడతాయి ”అని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

కిరణా ఆన్ బోర్డింగ్ కార్యక్రమాన్ని టిన్సుకియా (అస్సాం), అగర్తాలా (త్రిపుర), కన్నూర్ (కేరళ) వంటి ప్రదేశాలతో పాటు మారుమూల, దూర నగరాలకు విస్తరించినట్లు కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ తెలిపారు.

ఫ్లిప్‌కార్ట్ హైపర్‌లోకల్ దేశంలో కిరణ వ్యవస్థను బలోపేతం చేయడంలో గొప్ప సహాయకారిగా మారింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ-కామర్స్ పరిశ్రమతో పొత్తు పెట్టుకోవడానికి దేశవ్యాప్తంగా కిరణాల నుంచి పెరుగుతున్న భాగస్వామ్యాన్ని పొందినందుకు సంతోషిస్తున్నాం” అని ఫ్లిప్‌కార్ట్ అండ్ మార్కెట్ ప్లేస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమితేష్ ఝా అన్నారు. గత సంవత్సరం ఫ్లిప్‌కార్ట్ ది బిగ్ బిలియన్ డే సందర్భంగా కిరణాలు సమిష్టిగా 1 మిలియన్ సరుకులను పంపిణీ చేశాయి.

Follow Us:
Download App:
  • android
  • ios