బెంగళూరు: వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్‌కార్ట్ డైరెక్టర్ల బోర్డులో కీలక మార్పులు చేసింది. గ్రూప్ సీఈఓ కళ్యాణ్ కృష్ణమూర్తి, బ్యాంకింగ్ వెటరన్ కెకి మిస్త్రీల ప్రవేశం వచ్చే ఏడాది ఐపీఓ కంటే ముందే డైరెక్టర్ల బోర్డులో స్థానం కల్పించింది.

కొత్త మార్పులపై ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కల్యాణ్ కృష్ణమూర్తి గురువారం ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్‌లో వివరాలను వెల్లడించారు.

"గత నెల ప్రారంభంలో జరిగిన బోర్డు సమావేశంలో, మీ బోర్డు ఈ సంవత్సరం చేసిన ప్రయత్నాలన్నిటినీ ఎంతో అభినందిస్తున్నాము, మనము సాధించిన పురోగతిపై గర్వం వ్యక్తం చేశాము, మా అభివృద్ధి తరువాతి అధ్యాయాన్ని చూడటానికి ఎదురుచూస్తున్నాము.  

వాల్‌మార్ట్ పెట్టుబడి తరువాత మొదటి రెండేళ్ళలో మా ప్రస్తుత డైరెక్టర్లు పదవీవిరమణ చేయనున్నందున, కొత్త సంవత్సరంలో మా బోర్డులో కొన్ని మార్పులను చూస్తుందని మీకు తెలియజేయాలనుకుంటున్నాను "అని కళ్యాణ్ కృష్ణమూర్తి అన్నారు.

మేక్‌మైట్రిప్ వ్యవస్థాపకుడు, సీఈఓ రాజేష్ మాగో పదవీవిరమణ తరువాత సలహాదారుగా వ్యవహరించనున్నారు. రోహిత్ భగత్ ఫ్లిప్‌కార్ట్ నుంచి వైదొలిగిన తరువాత ఫోన్‌పేలో బోర్డు చైర్ పర్సన్ అవుతారు.

also read ఈ ఏడాది 2020లో లాంచ్ అయిన బెస్ట్ 5జి స్మార్ట్ ఫోన్స్ లిస్ట్ ఇదే.. ...

ఫ్లిప్‌కార్ట్ ను వాల్‌మార్ట్ కొనుగోలు తర్వాత చేరిన స్టీవర్ట్ వాల్టన్ వైదొలగిన తరువాత వాల్‌మార్ట్ పై దృష్టి పెట్టనున్నారు, డిర్క్ వాన్ డెన్ బెర్గె మార్చి చివరిలో పదవీ విరమణ చేశాక, వాల్‌మార్ట్  ఆసియా బిజినెస్ అండ్ గ్లోబల్ సోర్సింగ్ సంస్థ  బాధ్యతలు నిర్వ్వాహిస్తారు.

వచ్చే ఏడాది నుండి ఫ్లిప్‌కార్ట్ బోర్డులో నలుగురు కొత్త డైరెక్టర్ల చేరానున్నారు. అందులో హెచ్‌డిఎఫ్‌సి వైస్ చైర్మన్ అండ్ సిఇఒ కెకి మిస్త్రీ, అలాగే వాల్‌మార్ట్ నుండి ఇద్దరు కొత్త డైరెక్టర్లు; వాల్‌మార్ట్ గ్లోబల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ అండ్ చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అయిన సురేష్ కుమార్ అలాగే వాల్‌మార్ట్ ఇంటర్నేషనల్ స్ట్రాటజీ అండ్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అండ్ గ్రూప్ సిఇఓ కళ్యాణ్ కృష్ణమూర్తి.

40- 50 బిలియన్ల డాలర్ల విలువతో వచ్చే ఏడాది ఐ‌పి‌ఓకు  ఫ్లిప్‌కార్ట్ సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు. 2007లో స్థాపించిన ఫ్లిప్‌కార్ట్ గ్రూప్‌లో ఫ్లిప్‌కార్ట్, డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫాం ఫోన్‌పే, ఫ్యాషన్ స్పెషాలిటీ సైట్ మైంట్రా ఇంకా ఇకార్ట్, ఒక లాజిస్టిక్స్ అండ్ డెలివరీ సర్వీస్ ఉన్నాయి.