ఫ్లిప్‌కార్ట్ యూసర్లకు గుడ్ న్యూస్... వారికి ఉచితంగా యూట్యూబ్ ప్రీమియం..
సాధారణంగా ఏదైనా వీడియోలు లేదా సినిమాలు చూస్తున్నపుడు మధ్యలో వచ్చే యాడ్స్ చాలా మందికి ఒకోసారి చిరాకు కలిగిస్తుంటుంది దీని వల్ల మంది ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఇందుకోసం యూట్యూబ్ ఒక కొత్త ఆలోచన చేసింది.
బెంగళూరు : వీడియో స్త్రీమింగ్ యాప్ యూట్యూబ్ తన వినియోగదారులకు ఉచితంగా యూట్యూబ్ ప్రీమియంను అందిస్తుంది. సాధారణంగా ఏదైనా వీడియోలు లేదా సినిమాలు చూస్తున్నపుడు మధ్యలో వచ్చే యాడ్స్ చాలా మందికి ఒకోసారి చిరాకు కలిగిస్తుంటుంది దీని వల్ల మంది ఇబ్బందికి గురవుతూ ఉంటారు.
ఇందుకోసం యూట్యూబ్ ఒక కొత్త ఆలోచన చేసింది. యాడ్స్ వల్ల యూట్యూబ్ కి ఆదాయం వస్తుంది కాబట్టి యాడ్స్ లేకుండా వీడియోలను చూడలేము. అయితే యాడ్స్ లేకుండా వీడియో చూడాలనుకునే వారికోసం యూట్యూబ్ ప్రీమియంను తీసుకొచ్చింది.
దీనికి సబ్స్క్రిప్షన్ చేసుకుంటే యూట్యూబ్‌లో మీరు ఎటువంటి కంటెంట్ అయిన సరే ఎలాంటి యాడ్స్ లేకుండా చూడవచ్చు. అంతేకాదు ప్రీమియం సభ్యత్వం సహాయంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో యూట్యూబ్‌ను బ్యాక్ గ్రౌండ్ లో అమలు చేయగల సామర్థ్యం, ఓన్లీ-ఆడియో మోడ్‌ను అమలు చేయడం వంటి ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
also read లాక్ డౌన్ వల్ల ’బైజూస్’కు భారీ లాభాల పంట.. ...
అంటే మీరు ఈ ఫీచర్ సహాయంతో ఇతర యాప్ లను వినియోగిస్తున్నపుడు ఏదైనా క్లిప్ ఆడియోను ప్లే చేయవచ్చు. ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ప్లస్- యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ మొదటి 30-రోజులు ట్రయల్ ఆఫర్ కింద ఉచితంగా అందిస్తుంది. తరువాత మీకు నచ్చితే కొనుగోలు చేయవచ్చు.
యూట్యూబ్ ప్రీమియం అన్ని ప్రయోజనాలను ఉచితంగా పొందడానికి మరొక మార్గం కూడా ఉంది. మీరు ఫ్లిప్‌కార్ట్ ప్లస్ కస్టమర్ అయితే 6 నెలల ప్రీమియం సభ్యత్వాన్ని ఉచితంగా పొందవచ్చు. 150 సూపర్ నాణేల ద్వారా ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ ను పొందవచ్చు.
ఇంకేంటి ఫ్రీగా యూట్యూబ్ ప్రీమియం పొంది ఎలాంటి యాడ్స్ లేకుండా మీకు నచ్చిన వీడియో కంటెంట్ చూడండి.