ముదురుతున్న వివాదం : ఫేస్‌బుక్ ఎగ్జిక్యూటివ్ అంకిదాస్ పై కేసు నమోదు..
ఫేస్‌బుక్ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌తో పాటు మరో ఇద్దరిపై ఎకేస్‌ను ఛత్తీస్‌ఘడ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మతపరమైన భావాలను దెబ్బతీసినందుకు ఛత్తీస్‌ఘడ్ పోలీసులు ఫేస్‌బుక్ ఇండియా డైరెక్టర్ అంకి దాస్ తో పాటు మరో ఇద్దరు సోషల్ మీడియా వినియోగదారులపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.
సోషల్ మీడియా యాప్ ఫేస్‌బుక్ అధికార పార్టీ అయిన బీజేపీకీ వత్తాసు పలుకుతోంది అంటూ వచ్చిన వాల్‌స్ర్టీట్ జర్నల్ కథనంపై వివాదం ముదురుతోంది. ఫేస్‌బుక్ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్‌తో పాటు మరో ఇద్దరిపై ఎకేస్‌ను ఛత్తీస్‌ఘడ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
మతపరమైన భావాలను దెబ్బతీసినందుకు ఛత్తీస్‌ఘడ్ పోలీసులు ఫేస్‌బుక్ ఇండియా డైరెక్టర్ అంకి దాస్ తో పాటు మరో ఇద్దరు సోషల్ మీడియా వినియోగదారులపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. రాయ్‌పూర్‌కు చెందిన జర్నలిస్ట్ అవేష్ తివారీ ఫిర్యాదు మేరకు సోమవారం అర్థరాత్రి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఫేస్‌బుక్ డైరెక్టర్ ఇండియా, అంకి దాస్‌తో పాటు మరో ఇద్దరిని ఛత్తీస్‌ఘడ్ కు చెందిన ముంగేలికి చెందిన రామ్ సాహు, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన వివేక్ సిన్హాగా గుర్తించినట్లు వార్తా సంస్థ పిటిఐ తెలిపింది.
ఈ ముగ్గురిపై భారతీయ శిక్షాస్మృతి ప్రకారం సెక్షన్ 295 (ఎ) (మతపరమైన భావాలను ఆగ్రహానికి గురిచేసే ఉద్దేశపూర్వక, హానికరమైన చర్యలు), 505 (1) (సి), 506 (క్రిమినల్ బెదిరింపు), 500 (పరువు నష్టం) 34 (సాధారణ ఉద్దేశం) పై కేసులు నమోదు చేశారు. ఫేస్‌బుక్ అంకి దాస్ దాఖలు చేసిన కేసు ఫైల్ లో రాయ్పూర్ జర్నలిస్ట్ పేరు కూడా ఉంది.
ఆన్‌లైన్ పోస్టుల ద్వారా తన ప్రాణాలకు బెదిరింపులు వస్తున్నాయని ఆరోపిస్తూ అంకి దాస్ ఢీల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాక, మతపరమైన మనోభావాలను దెబ్బతీసారని ఆరోపిస్తూ రాయ్‌పూర్‌కు చెందిన జర్నలిస్ట్ అవేష్ తివారీ ఫిర్యాదు మేరకు సోమవారం అర్థరాత్రి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
also read వాహనదారులపై మళ్ళీ ఇంధన భారం.. వరుసగా 3వ రోజు పెరిగిన పెట్రోల్ ధర.. ...
రాయ్‌పూర్‌కు చెందిన జర్నలిస్ట్ తన ఫిర్యాదులో ఆగస్టు 16న వాల్ స్ట్రీట్ జర్నల్‌లో ప్రచురించిన కథనానికి సంబంధించి తన ఫేస్‌బుక్ ఖాతాలో ఒక పోస్ట్ పెట్టారు. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ఆధారంగా తాను పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ పై వాట్సాప్‌లో బెదిరింపు సందేశాలు, కాల్స్ వస్తున్నాయని తివారి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
మతపరమైన ద్వేషాన్ని వ్యాప్తి చేయడం ద్వారా అంకిదాస్, సాహు, సిన్హా తనను పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని, తన ప్రాణానికి ముప్పు ఉందని, తాను నిరంతరం భయంతో బతుకుతున్నానంటూ ఆరోపించారు.
"సాహు అవమానకరమైన, మతపరంగా సున్నితమైన ఛాయాచిత్రాలను పోస్ట్ చేసి నన్ను బెదిరించాడు. " అని తివారీ తెలిపాడు. తివారీ తన పోస్ట్ తర్వాత తనకు వాట్సాప్‌లో బెదిరింపు సందేశాలు, కాల్స్ వస్తున్నాయని చెప్పారు. ఫేస్‌బుక్ ప్రతినిధి తనపై వేసిన ఆరోపణలను తివారీ ఖండించారు. ఫిర్యాదులో తన పేరుకు ఎందుకు పేరు పెట్టారో తనకు అర్థం కాలేదన్నారు.
మతపరమైన ద్వేషాన్ని వ్యాప్తి చేయడం ద్వారా అంకి దాస్, సాహు, సిన్హా తన పరువు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని, దీనివల్ల అతని ప్రాణానికి ముప్పు ఉందని, అతను నిరంతరం భయంతో జీవిస్తున్నానని ఆరోపించారు.