ఫావ్-జి గేమ్ అభివృద్ధి చెందుతున్న సంస్థగా ఎన్-కోర్ గేమ్స్ తెలియజేసింది. కేవలం 24 గంటల్లో గూగుల్ ప్లే స్టోర్‌లో అత్యధిక ప్రీ-రిజిస్ట్రేషన్ నమోదైనట్లు ఎన్-కోర్ గేమ్స్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసింది.
పబ్-జికి పోటీగా ప్రారంభించిన మేడ్ ఇన్ ఇండియా మల్టీ ప్లేయర్ మొబైల్ గేమ్ ఫావ్-జి సంచలనం సృష్టిస్తుంది. కేవలం 24 గంటల్లో గూగుల్ ప్లే స్టోర్‌లో 10 లక్షల ప్రీ-రిజిస్ట్రేషన్ మార్క్‌ను దాటింది. ఫావ్-జి గేమ్ అభివృద్ధి చెందుతున్న సంస్థగా ఎన్-కోర్ గేమ్స్ తెలియజేసింది.
కేవలం 24 గంటల్లో గూగుల్ ప్లే స్టోర్‌లో అత్యధిక ప్రీ-రిజిస్ట్రేషన్ నమోదైనట్లు ఎన్-కోర్ గేమ్స్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసింది. ఎన్-కోర్ గేమ్స్ ఈ ఏడాది అక్టోబర్‌లో ఫావ్-జి గేమ్ ప్రారంభించాల్సి ఉంది, కానీ నవంబర్ చివరిలో ప్లే-స్టోర్‌లో ఫావ్-జి గేమ్ కోసం ప్రీ-రిజిస్ట్రేషన్ కోసం లింక్ ని అందుబాటులోకి తెచ్చింది.
ఈ లింక్ ద్వారా ఫావ్-జి గేమ్ కోసం ప్రీ-రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి గేమ్ అందుబాటులోకి రాగానే డౌన్ లోడ్ చేసుకోమని నోటిఫికేషన్ అందిస్తుంది.
ఫావ్-జి గేమ్ ను గూగుల్ ప్లే-స్టోర్‌లో నవంబర్ 30న కంపెనీ ప్రత్యక్ష ప్రసారం చేసింది. అప్పటి నుండి ప్రీ-రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉండగా, ఫావ్-జి గేమ్ ప్రారంభ తేదీ గురించి కంపెనీ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.
also read వచ్చే ఏడాది నుండి ఆ శామ్సంగ్ స్మార్ట్‌ఫోన్ కి బై బై.. డిమాండ్ తగ్గడమే కారణమా..? ...
ఫావ్-జి గేమ్ పూర్తి పేరు ఫియర్లెస్ అండ్ యునైటెడ్ గార్డ్స్. ఫావ్-జి గేమ్ ఇండియన్ గేమ్ డెవలపర్ కంపెనీ ఎన్-కోర్ గేమ్స్ సృష్టించి అభివృద్ది చేసిన ఇండియా గేమ్ యాప్.
ఎన్-కోర్ సహ వ్యవస్థాపకుడు విశాల్ గొండాల్ మాట్లాడుతూ, ఈ గేమ్ పబ్-జి గేమ్ ని భర్తీ చేస్తుంది. పబ్-జి లాగానే ఫావ్-జి స్థానికంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతుంది. ఈ గేమ్ ద్వారా వచ్చే ఆదాయంలో 20% వీర్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు వెళ్తుంది.
'భారత్ కే వీర్' అనేది ఆర్మీ సిబ్బందికి అంకితమైన సంస్థ, దీనిని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్థాపించింది. కొన్ని రోజుల క్రితం ఫావ్-జి గేమ్ టీజర్‌ను బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విడుదల చేశారు. ఫావ్-జి గేమ్ మొదటి ఎపిసోడ్ గాల్వన్ వ్యాలీ సంఘటన ఆధారంగా రూపొందించబడింది. ఫావ్-జి గేమ్ లో భారత సైన్యం రూపంలో ప్లేయర్స్ ని చూపించారు.
గాల్వాన్ లోయలో ఇండియా-చైనా సరిహద్దుల మధ్య జరిగిన ఘర్షన కారణంగా భారత ప్రభుత్వం పబ్-జి గేమ్ తో సహ వందకి పైగా చైనా యాప్స్ ని నిషేదించిన విషయం మీకు తెలిసిందే.
Thank you for a fantastic response! Highest number of pre-registrations in India in less than 24 hours!
— nCORE Games (@nCore_games) December 2, 2020
1+ million and counting... #FAUG #BeFearless
Pre-register now at: https://t.co/4TXd1F7g7J@vishalgondal @akshaykumar @dayanidhimg pic.twitter.com/jXXStGFlWR
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 3, 2020, 11:11 AM IST