Asianet News TeluguAsianet News Telugu

ఫేస్‌బుక్‌కు పోటీగా మరో కొత్త యాప్.. కేవలం 1 వారంలోనే 25లక్షలకు పైగా డౌన్‌లోడ్లు..

ఈ వాట్సాప్ ప్రైవసీ పాలసీ ఫిబ్రవరి 8 నుండి అమలులోకి రోబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆ సమయంలో సిగ్నల్ యాప్, టేలిగ్రాం డౌన్ లోడ్లు భారీగా పెరిగాయి. ఇందులో వాట్సాప్ నుండి బదిలీ అయిన వారు, కొత్త డౌన్ లోడ్లు కూడా ఉన్నాయి.

Facebook rival MeWe app gains 2.5M downloads in a week as users seek privacy
Author
Hyderabad, First Published Jan 22, 2021, 4:35 PM IST

గత కొంతకాలంగా ఫేస్‌బుక్ యజమాన్యంలోని  వాట్సాప్ ప్రైవసీ పాలసీ విధానం యూజర్లను ఆందోళనకు గురిచేస్తుంది. ఈ వాట్సాప్ ప్రైవసీ పాలసీ ఫిబ్రవరి 8 నుండి అమలులోకి రోబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.

ఆ సమయంలో సిగ్నల్ యాప్, టేలిగ్రాం డౌన్ లోడ్లు భారీగా పెరిగాయి. ఇందులో వాట్సాప్ నుండి బదిలీ అయిన వారు, కొత్త డౌన్ లోడ్లు కూడా ఉన్నాయి. ఒకేసారి వాట్సాప్ డౌన్ లోడ్లు తగ్గడం, కొత్త డౌన్ లోడ్లు నిలిచిపోవడంతో వాట్సాప్ ప్రైవసీ పాలసీ విధానన్నీ  బ్రేక్ పడింది.

వాట్సాప్ డేటా షేరింగ్ వివాదం నేపథ్యంలో చాలా మంది యూసర్లు ప్రత్యన్యాయంగా  కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల వైపు మొగ్గు చూపుతున్నారు. 

సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటివి ప్రైవసీ ఉల్లంఘనకు పాల్పడటంతో పాటు యూజర్ల యాక్టీవీటి మీద నిఘా పెంచడంతో చాలా మంది ఇతర యాప్ లను ఎంచుకోవడానికి  ఇష్టపడుతున్నారు.

also read సోషల్ మీడియాలో ఈ తప్పులు చేయకండి.. లేదంటే జైలు శిక్ష తప్పదు.. ...

ఇది ఇలా ఉంటే తాజాగా యుఎస్ ఆధారిత సోషల్ నెట్‌వర్క్ "మీవే" యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో అత్యధికంగా డౌన్‌లోడ్ చేయబడిన సోషల్ యాప్‌గా నిలిచింది. కేవలం ఒక్క వారంలోనే 2.5 మిలియన్లకు పైగా యూజర్లు దీనిని డౌన్‌లోడ్ చేసుకున్నారు.

2016 నుంచి 2020 అక్టోబర్ వరకు ఈ సోషల్ నెట్‌వర్క్ ‌యాప్ ను 9 మిలియన్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ ప్లాట్‌ఫామ్‌లో ప్రస్తుతం 15.5 మిలియన్ల మంది వినియోగదారులు ఉన్నారు.

"మీవే" ఇప్పుడు 20 భాషలలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం హాంకాంగ్‌లో నెం.1సోషల్ యాప్ గా "మీవే" కొనసాగుతుంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం యూజర్ల డేటాను గౌరవించే సోషల్ నెట్‌వర్క్‌గా  నిలిచినందున దీనిని చాలా మంది వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకుంటుంటున్నట్లు పేర్కొంది.

ఇది సోషల్ నెట్‌వర్క్ యాప్ యాడ్ ఫ్రీగా కొనసాగనుంది. 2021 జనవరి 15నాటికి ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్‌లోడ్ పరంగా 3స్థానంలో, సోషల్ మీడియా యాప్స్ డౌన్‌లోడ్ పరంగా  మొదటి స్థానంలో కొనసాగుతుంది.

ఇప్పటివరకు వాట్సాప్ కు పోటీగా సిగ్నల్, టెలిగ్రామ్ యాప్ లు ఉన్నాయి. ఇప్పుడు ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి వాటికీ ప్రత్యామ్నాయంగా "మీవే" యాప్ నిలిచింది. యాడ్ ఫ్రీగా కొనసాగుతుండటంతో ఎక్కువ మంది యూజర్లు ఈ యాప్ ని  డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు.

వాట్సాప్ కొత్త  ప్రైవసీ పాలసీ విధానం పై వాట్సాప్ ఇప్పటికే  వినియోగదారులకి డాటా గోప్యతాపై స్పష్టత ఇచ్చిన సంగతి మీకు తెలిసిందే.
 

Follow Us:
Download App:
  • android
  • ios