Asianet News TeluguAsianet News Telugu

ఫేస్‌బుక్ యూసర్లకు షాకింగ్ న్యూస్.. లైక్ బటన్ తొలగింపు..

 ఫేస్‌బుక్ ఇటీవల వాట్సాప్ వినియోగదారుల కోసం కొత్త ప్రైవసీ పాలసీ విడుదల చేసింది. తాజాగా ఇప్పుడు ఫేస్‌బుక్ గురించి పెద్ద ప్రకటన చేసింది. 

facebook removed like button from public pages with new update this year
Author
Hyderabad, First Published Jan 7, 2021, 1:13 PM IST

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కొత్త సంవత్సరంలో చాలా కొత్త మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా ఫేస్‌బుక్ ఇటీవల వాట్సాప్ వినియోగదారుల కోసం కొత్త ప్రైవసీ పాలసీ విడుదల చేసింది.

తాజాగా ఇప్పుడు ఫేస్‌బుక్ గురించి పెద్ద ప్రకటన చేసింది. ఫేస్‌బుక్ కొత్తగా అప్‌డేట్ చేసిన డిజైన్‌లో ఫేస్‌బుక్ పబ్లిక్ పేజెస్ నుండి లైక్ బటన్‌ను తొలగించింది.

సాధారణంగా పబ్లిక్ ఫిగర్స్, ఆర్టిస్ట్స్, సెలెబ్రిటీస్, ఫేస్‌బుక్ పేజీలు క్రియేట్ చేస్తుంటారు, ఈ పేజెస్ కి ఫాలోతో పాటు లైక్ బటన్ కూడా ఉంటుంది, కాని కొత్త అప్ డేట్ తరువాత లైక్ బటన్ కనిపించదు.  

also read వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ. ఫిబ్రవరిలోగా అంగీకరించకుంటే మీ అక్కౌంట్ డిలెట్.. ...

ఇప్పుడు ఫేస్‌బుక్ పేజీలోని ఫాలో బటన్ మాత్రమే ఫేస్‌బుక్‌లో చూపిస్తుంది, కాని కొత్త అప్‌డేట్ తర్వాత మీరు ఫాలో బటన్‌ను మాత్రమే చూస్తారు. ఇక పేజెస్ లోని పోస్ట్‌లో లైక్ బటన్ కనిపిస్తుంది. ఫేస్‌బుక్ బుధవారం తన బ్లాగులలో కొత్త అప్ డేట్ గురించి సమాచారం ఇచ్చింది.

ఫేస్‌బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ 20 ఫిబ్రవరి 2021 నుండి అమల్లోకి రానుంది, దీని ప్రకారం మీరు వాట్సాప్ ఉపయోగించాలనుకుంటే మీరు దాని ప్రైవసీ పాలసీ నిబంధనలను పూర్తిగా అంగీకరించాలి, లేకపోతే మీరు మీ వాట్సాప్ ఖాతాను తొలగించవచ్చు. 

నోటిఫికేషన్  స్క్రీన్ షాట్ ప్రకారం ఒక వినియోగదారుడు మా షరతులను ఆమోదించకపోతే, అతను తన వాట్సాప్ ఖాతాను తొలగిపోతుందని కొత్త నిబంధనలలో స్పష్టంగా తెలిపింది. వాట్సాప్ కొత్త నిబంధనలు ఫేస్ బుక్ యాజమాన్యంలోని సంస్థ కొత్త సంవత్సరంలో వాట్సాప్ వినియోగదారుల డేటాను ఎలా ఉపయోగిస్తుందో వివరిస్తుంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios