ఫేస్‌బుక్ మెసెంజర్ వాడుతున్నారా.. జాగ్రత్త కాల్స్ ద్వారా మీ ఫోన్ హ్యాక్ కావొచ్చు..
ఈ బగ్ ఫేస్‌బుక్ మెసెంజర్ వీడియో, ఆడియో కాల్స్ పై ప్రభావితం చేస్తుంది, అయితే ఈ బగ్ వల్ల ఆండ్రాయిడ్ వినియోగదారులపై ఎక్కువగా ప్రభావం చూపనుంది. ఫేస్‌బుక్ మెసెంజర్ ఈ బగ్ను గూగుల్ ప్రాజెక్ట్ జీరోలోని భద్రతా పరిశోధకులు నివేదించారు.
ఫేస్‌బుక్ మెసెంజర్‌ను ఉపయోగించే వారిలో మీరు కూడా ఒకరు అయితే, ఈ వార్త మీకు చాలా ముఖ్యం. ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ లో ఒక క్లిష్టమైన బగ్‌ను కనుగొన్నారు, ఇది ఫేస్‌బుక్ మెసెంజర్ యూసర్ల అనుమతి లేకుండా ఆడియో కాల్‌లను కనెక్ట్ చేయడానికి హ్యాకర్లకు అనుమతిస్తుంది.
ఆండ్రాయిడ్ ఫోన్‌ల ద్వారా ఫేస్‌బుక్ వినియోగదారులపై నిఘా పెట్టడానికి ఈ బగ్ ఉపయోగపడుతుందని ఒక నివేదిక తెలిపింది.
ఈ బగ్ ఫేస్‌బుక్ మెసెంజర్ వీడియో, ఆడియో కాల్స్ పై ప్రభావితం చేస్తుంది, అయితే ఈ బగ్ వల్ల ఆండ్రాయిడ్ వినియోగదారులపై ఎక్కువగా ప్రభావం చూపనుంది. ఫేస్‌బుక్ మెసెంజర్ ఈ బగ్ను గూగుల్ ప్రాజెక్ట్ జీరోలోని భద్రతా పరిశోధకులు నివేదించారు.
పరిశోధకుల ప్రకారం, ఈ లోపం ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ వెబ్ఆర్టిసిలో ఉంది. WebRTC అనేది ప్రోటోకాల్, దీని ద్వారా వీడియో, ఆడియో కాలింగ్ యాప్ ద్వారా చేసుకోవడానికి అనుమతిస్తుంది.
also read నేడు ప్రపంచ టెలివిజన్ దినోత్సవం సందర్భంగా బడ్జెట్ ధరకే లభించే 4కే స్మార్ట్ టీవీలు ఇవే.. ...
గూగుల్ పరిశోధకులు గత నెలలో ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌కు నివేదించారు, దీంతో సోషల్ మీడియా దిగ్గజం బుధవారం మెసెంజర్ ఆండ్రాయిడ్ యాప్‌కు అప్‌డేట్ చేసింది. గూగుల్ ప్రాజెక్ట్ జీరో భద్రతా బృందం కోసం పనిచేస్తున్న పరిశోధకురాలు నటాలీ సిల్వనోవిచ్ చేసిన భద్రతా ఆడిట్ సమయంలో ఈ బగ్ కనుగొనబడింది.
ఈ సమస్యను నివేదించినందుకు ఫేస్‌బుక్ తనకు 60 వేల బగ్ బౌంటీని ఇచ్చిందని సిల్వనోవిచ్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇప్పుడు మీరు మీ ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ అప్ డేట్ ద్వారా మీ చాట్, కాల్స్ ను భద్రపరచవచ్చు. విశేషమేమిటంటే మెసెంజర్‌లోని ఈ బగ్ కొత్త ఫీచర్ వానిష్ మోడ్ ప్రవేశపెట్టిన తర్వాత వచ్చింది.
ఇటీవల ఫేస్‌బుక్ వానిష్ మోడ్‌ను ఫేస్‌బుక్ మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్ కోసం విడుదల చేసింది, ఇది వాట్సాప్ డిస్-ఆపియరింగ్ ఫీచర్ లాగానే ఉంటుంది. వానిష్ మోడ్ ప్రస్తుతం యు.ఎస్ తో పాటు మరికొన్ని దేశాలలో
మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్ యూసర్లకు అందుబాటులో ఉంది. 2018లో పరిశోధకులు సిల్వనోవిచ్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ కోసం వాట్సాప్‌లో ఒక బగ్‌ను కనుగొన్నాడు, ఇది వినియోగదారుల వీడియో కాల్స్ కి సమాధానం ఇచ్చిన తర్వాత హ్యాకర్లకు యూసర్ల వాట్సాప్ కి అక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది.