ఫేస్‌బుక్ యజమాన్యంలోని మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్ యాప్స్ కోసం వనిష్ అనే కొత్త మోడ్‌ను విడుదల చేసింది. అయితే ఫేస్‌బుక్ మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే ఈ వనిష్ మోడ్, వాట్సాప్ లో రాబోయే ఫీచర్ డిస్అప్పిరింగ్ మోడ్ లాగానే ఉంటుంది.

వానిష్ మోడ్ ప్రస్తుతం యు.ఎస్ తో పాటు మరికొన్ని దేశాలలో అందుబాటులో ఉంది. ఫేస్‌బుక్ వానిష్ మోడ్ ఫీచర్ ద్వారా మీ మెసేజెస్ ఏవైనా రిసీవర్ చూడగానే అదృశ్యం  అవుతాయి. అలాగే, వానిష్ మోడ్‌లో పంపిన మెసేజెస్ ఫార్వార్డ్ చేయడానికి వీలుండదు.

వనిష్ మోడ్‌లో పంపిన మెసేజెస్ చాట్ హిస్టరీలో కనిపించవు. ఒక విధంగా చెప్పాలంటే వానిష్ మోడ్ ఇన్స్టంట్ చాటింగ్ కోసం మాత్రమే.

 ఇన్‌స్టాగ్రామ్ కూడా హోమ్‌పేజీలో మార్పులను తీసుకువచ్చింది. ఇటీవల భారతదేశంలో ప్రారంభించిన రీల్స్ ట్యాబ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది, నావిగేషన్ బార్‌కు షాప్ బటన్ కూడా జోడించింది.  

also read  సామాన్యుడి జేబుకి చిల్లు.. వచ్చే ఏడాది నుండి మరింత పెరగనున్న మీ ఫోన్ బిల్లు.. ...

 మీరు కనెక్ట్ అయిన వ్యక్తులతో మాత్రమే చాట్‌లో వానిష్ మోడ్‌ను ఉపయోగించవచ్చని ఫేస్‌బుక్ తెలిపింది. గ్రూప్ చాట్‌లకు వానిష్ మోడ్‌ వర్తించదు, కేవలం ప్రైవేట్ చాట్‌లలో మాత్రమే ఈ ఫీచర్ పని చేస్తుంది. ఫేస్‌బుక్ మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్ లో వానిష్ మోడ్‌ను చేర్చడం వల్ల స్నాప్‌చాట్‌తో సమానంగా ఉంటుంది.

వనిష్ మోడ్ లో చాట్‌ రిసీవర్ మెసేజ్ చూసిన తర్వాత అదృశ్యమవుతాయి, చాట్ అదృశ్యమయ్యే ముందు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుంటే పంపినవారికి నోటిఫికేషన్ వస్తుంది.

వానిష్ మోడ్‌ను ఎలా ఉపయోగించాలంటే..
మీరు ఏదైనా పర్సనల్ చాట్‌లో పైకి స్వైప్ చేసి వానిష్ మోడ్ ఆన్ చేయవచ్చు, వొద్దనుకుంటే క్రిందికి స్వైప్ చేయవలసి ఉంటుంది. వానిష్ మోడ్ లో టెక్స్ట్ చాటింగ్, పిక్చర్స్, ఫోటోలు, జీఫీలు మొదలైనవి కూడా ఉపయోగించవచ్చు.