వీడియో చాట్ కోసం ఫేస్‌బుక్ కొత్త ఫీచర్...ఒకేసారి 50 మందితో...
కరోనా మహమ్మారి కారణంగా భారతదేశంతో సహ ప్రపంచంలోని చాలా దేశాలు లాక్‌డౌన్ కొనసాగిస్తుండటంతో ఉద్యోగులు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్నారు. ఇంటర్నెట్ వినియోగం మరింత పెరిగింది, దీంతో గ్రూప్ వీడియో కాలింగ్ సేవలు రికార్డు స్థాయిలో పెరిగాయి.
వాషింగ్టన్: ప్రపంచవ్యప్తంగా కరోనా వైరస్ దెబ్బకి ఆగ్ర దేశాలతో సహ భారతదేశం వాణికిపోతుంది. దీని బారిన పడి ఇప్పటికే ఎంతోమంది మరణించారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఇండియాలో లాక్ డౌన్ కూడా విధించారు. దీంతో ప్రజలు అత్యవసరమైతేనే తప్ప బయటికి రాలేని పరిస్థితి.
కరోనా మహమ్మారి కారణంగా భారతదేశంతో సహ ప్రపంచంలోని చాలా దేశాలు లాక్‌డౌన్ కొనసాగిస్తుండటంతో ఉద్యోగులు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్నారు. ఇంటర్నెట్ వినియోగం మరింత పెరిగింది, దీంతో గ్రూప్ వీడియో కాలింగ్ సేవలు రికార్డు స్థాయిలో పెరిగాయి.
ఉగ్యోగులు వీడియో కాన్ఫరెన్సుల కోసం ఎక్కువగా 'జూమ్' యాప్‌ను వినియోగిస్తున్నారు. ఒక్క నెలలోనే 30 కోట్ల మంది జూమ్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. జూమ్ యాప్ తో ప్రత్యేకత ఏంటంటే వీడియో మీటింగ్‌లో సుమారు 100 మంది వరకు పాల్గొనవచ్చు.
వీడియో కాల్స్, వీడియో కాన్ఫరెన్స్ యాప్‌లకు డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో జూమ్ యాప్ కు పోటీగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ 'మెసెంజర్ రూమ్స్'అనే పేరుతో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా 50 మందితో గ్రూప్ వీడియో చాట్ కూడా చేసుకోవచ్చు.
మెసెంజర్ రూమ్‌లను క్రియేట్ చేసే వారు ఆ రూమ్‌లను ప్రైవేటుగా ఉంచుకోవచ్చు. అవసరంలేని పార్టిసిపెంట్లను బ్లాక్ కూడా చేసే ఫీచర్ ఇందులో ఉంది. మెసెంజర్ రూమ్‌లలో వినియోగదారులు వారి న్యూస్‌ఫీడ్ లేదా గ్రూప్‌లు లేదా ఈవెంట్ పేజీలలో లింకులను పోస్ట్ చేయవచ్చు.
మెసెంజర్ రూమ్ క్రియేట్ అయిన తర్వాత ఎవరైనా బ్రౌజర్ ద్వారా కూడా చేరవచ్చు. అయితే కరోనా వైరస్ నియంత్రణకు సామాజిక దూరమే ముందు జాగ్రత అని దానిని దృష్టిలో ఉంచుకొని గ్రూప్ వీడియో చాట్ కోసం మెసెంజర్ రూమ్స్ ఫీచర్ ఆవిష్కరించినట్లు ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ చెప్పారు.
ఫేస్ బుక్ తాజాగా రిలయన్స్ జియోతో భారీ ఒప్పందం చేసిన సంగతి మీకు తెలిసిందే.