గుడ్ న్యూస్: త్వరలో ఫేస్‌బుక్ నుంచి ఫ్రీ ఇంటర్నెట్...
త్వరలోనే ఫేస్‌బుక్ నుంచి ఫ్రీ ఇంటర్నెట్ సర్వీస్ మొదలు కాబోతుందట, అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో ఫ్రీ ఇంటర్నెట్ సర్వీస్‌ను అందించే దిశగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఈ యాప్‌ను రూపొందించింది.
మీరు ఫేస్‌బుక్ వాడుతున్నారా అయితే మీకో గుడ్ న్యూస్.అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఇంటర్నెట్ సదుపాయాన్ని విస్తరించడానికి ఫేస్‌బుక్ ఒక కొత్త యాప్ పరీక్షిస్తోంది. డిస్కవర్ అని పిలువబడే ఈ యాప్ వినియోగదారులకు ఉచిత బ్రౌజింగ్ డేటాను అందిస్తుంది.
త్వరలోనే ఫేస్‌బుక్ నుంచి ఫ్రీ ఇంటర్నెట్ సర్వీస్ మొదలు కాబోతుందట, అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో ఫ్రీ ఇంటర్నెట్ సర్వీస్‌ను అందించే దిశగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఈ యాప్‌ను రూపొందించింది. దక్షిణ అమెరికా దేశం పెరూలో ఫేస్‌బుక్ ప్రయోగాత్మకంగా వినియోగదారులకు డిస్కవర్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ డిస్కవర్ యాప్ ద్వారా పలు మొబైల్ నెట్ వర్కింగ్ సంస్థలు అందించే డేటాను ఉచితంగా వినియోగించుకోవచ్చు. భవిష్యత్తులో ఈ సేవలను థాయ్‌లాండ్, ఫిలిప్పీన్స్, ఇరాక్‌తో సహా ఇతర దేశాలకు విస్తరించనున్నట్లు సంస్థ తెలిపింది.
also read అద్భుతమైన ఫీచర్లతో షావోమి ఎంఐ 10 స్మార్ట్ ఫోన్ లాంచ్..
వినియోగదారులు ప్రతిరోజూ వారి నెట్వర్క్ ప్రొవైడర్ నుండి ఉచిత డేటాను పొందుతారు. అది మీకు అందుబాటులో ఉన్నప్పుడు మీరు ఒక నోటిఫికేషన్ పొందుతారు. డిస్కవర్ తక్కువ-బ్యాండ్‌విడ్త్ బ్రౌజింగ్‌ను మాత్రమే అందిస్తుంది కాబట్టి మీరు వెబ్‌సైట్ లోడ్ చేయవచ్చు కాని వీడియో, ఆడియో లేదా ఇతర డేటా-ఇంటెన్సివ్ పని చేయవు.
మీరు వీడియొ లేదా ఆడియో స్ట్రీమ్ చేయాలనుకుంటే మీరు అదనపు డేటాను కొనుగోలు చేయవల్సి ఉంటుంది. ఈ యాప్‌ను ఉపయోగించుకోవాలంటే ఫేస్‌బుక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదని పేర్కొంది. అలాగే ఈ యాప్ ద్వారా బ్రౌజింగ్ హిస్టరీని ఫేస్‌బుక్ సేకరించబోదని వెల్లడించింది.