న్యూ ఢీల్లీ: ఇండియన్ ఆర్మీలో పనిచేసే అధికారులు, సైనికులు వెంటనే జాబితా చేసిన 89 యాప్ లను  వారి ఫోన్ నుండి డిలెట్ చేయాలని ఇండియన్ ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. ఇందులో న్యూస్ అగ్రిగేటర్ డైలీ హంట్, సోషల్ నెట్‌వర్క్ షేర్‌చాట్, ఎంటర్టైన్మెంట్ యాప్ హంగామా, ఫేస్‌బుక్, టిక్‌టాక్, స్నాప్‌చాట్, టిండర్, యుసి బ్రౌజర్, హెలో, కామ్‌స్కానర్, క్లబ్ ఫ్యాక్టరీ, పబ్ జితో సహా మొత్తం 89 యాప్‌లను తొలగించాలని భారత సైన్యం సైనికులు, అధికారులను కోరింది.

ఈ యాప్స్ భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భారతదేశ రక్షణ, రాష్ట్ర భద్రత వంటి కార్యకలాపాలకు భంగం కలిగించేలా నిమగ్నమై ఉన్నాయి అని కేంద్రం ఇప్పటికే 59 యాప్స్ ని నిషేధించింది. తాజాగా  వీటితో పాటు మరికొన్ని యాప్స్ పై కూడా ఆర్మీలో నిషేదించాలని ఆర్డర్ జారీ చేసింది. గాల్వాన్ సరిహద్దులలో జరిగిన చైనా, ఇండియా మధ్య ఘర్షణ కారణంగా ఈ నిషేధం జూలై మొదటి వారంలో అమలులోకి వచ్చింది.

also read జూమ్‌ యాప్‌ను కాపీ చేసిందంటు జియోమీట్‌పై ఫైర్‌.. చట్టపరమైన చర్యలకు సిద్ధం.. ...

తాజాగా ఆర్మిలో నిషేధించిన యాప్స్ లో ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో పాటు, పబ్ జి గేమ్ చేరాయి. టిక్‌టాక్, వీచాట్, యుసి బ్రౌజర్, న్యూస్‌డాగ్ సహ ఇతర యాప్స్  చైనా దేశానికి చెందినవి.

ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిషేధించిన యాప్స్ అన్నీ పూర్తిగా లేదా మెజారిటీ శాతం యాజమాన్యం చైనాలోని వ్యక్తులకు లేదా కార్పొరేషన్లు చెందినవి. ఆర్మీ నిషేధంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలలో  యుఎస్ దేశానికి చెందిన ఫేస్ బుక్, స్నాప్ చాట్, జూమ్ నుండి స్వీడన్ దేశానికి చెందిన  ట్రూకాలర్ వరకు ఉన్నాయి.

హాని ట్రాప్, డేటా దుర్వినియోగంపై  పెరుగుతున్న ఆందోళనల మధ్య సైన్యం ఈ చర్య తీసుకుంది. ఈ యాప్స్ చాలా వరకు యూజర్ లొకేషన్ చేరవేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే  రక్షణ సిబ్బంది దేశ సరిహద్దుల వద్ద లేదా సున్నితమైన ప్రదేశాలలో పనిచేస్తున్నప్పుడు ఇవి హాని కలిగించే అవకాశాలు ఉన్నాయని  తెలిపింది.