Asianet News TeluguAsianet News Telugu

ఫేస్‌బుక్‌ ఉద్యోగుల ఆశలపై నీళ్లు...ఖర్చులు తప్పించుకునేందుకు శాశ్వతంగా ‘వర్క్ ఫ్రం హోం’...

కరోనా దెబ్బకు 2030 వరకల్లా సంస్థలోని 50 శాతానికి పైగా ఉద్యోగులను 'ఇంటి నుంచే పని' చేయించేందుకు సిద్ధమవుతోంది ఫేస్​బుక్​. అలాగైతే, బోలెడు డబ్బులు మిగులుతాయి అనుకున్న ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు ఎఫ్​బీ సీఈఓ మార్క్​ జుకర్​బర్గ్​. అవకాశం వచ్చింది కదా అని.. నగరాల్లో ఖర్చు తప్పించుకుని గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగం చేస్తానంటే.. అక్కడి ఖర్చులకు తగ్గట్టే జీతం ఉంటుందన్నారు​.
 

facebook employees permanent work from plan to reduce expensives: mark zucker burg
Author
Hyderabad, First Published May 28, 2020, 1:29 PM IST

శాన్ ఫ్రాన్సిస్కో: కరోనా నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ఉద్యోగులకు శాశ్వతంగా ‘వర్క్ ఫ్రం హోం’ ఆఫర్ ఇచ్చింది. అయితే వారు నివాసం ఉండే ప్రాంతాల్లో కార్మికుల వేతనాలకు అనుగుణంగా వేతనాల్లో సర్దుబాటు ఉంటుందని మార్క్ జుకర్ బర్గ్ బాంబు వేశారు. 

‘మీరు ఉండే ప్రాంతంలో జీవన వ్యయం తక్కువగా ఉంటే, శ్రామికులకు ఇచ్చే జీతాలు తక్కువగా ఉంటే వాటిని బట్టి.. మీ జీతంలోనూ మార్పులు వస్తాయి. కాబట్టి మీరు ఎక్కడ స్థిర పడాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి. దానిని బట్టి మీ వేతనం ఉంటుంది’ అని ఫేస్ బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘అయితే, తక్కువ వ్యయం జరుగుతున్న చోట ఉంటూ.. ఎక్కువ జీవన వ్యయం ఉన్న నగరాల్లో ఉంటున్నామని తప్పుడు సమాచారమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం' తన సిబ్బందికి మార్క్​ జుకర్​బర్గ్​ తేల్చి చెప్పారు. 

2021 జనవరి 1వ తేదీ లోపు ఇళ్ల నుంచి ఉద్యోగాలు చేసేవారు తాము వెళ్లాలనుకున్న చోటుకు మారాలని జుకర్​బర్గ్ సూచించారు​. వారెక్కడి నుంచి పని చేయాలనుకుంటున్నారో కచ్చితంగా చెప్పాలన్నారు. దాన్ని బట్టి జీతాలు ఖరారు చేస్తామని, ఇది సంస్థ ఆదాయం పన్ను, అకౌంట్లకు అత్యవసరమని తెలిపారు.

also read నీటిపై న‌డిచే సైకిల్ వ‌చ్చేసింది‌..గంటకు 14కి.మి ప్రయాణించొచ్చు...

2018 నాటికి, ఫేస్‌బుక్‌లో సగటు ఉద్యోగి జీతం సంవత్సరానికి దాదాపు రూ. 1.82 కోట్లకు పైచిలుకు. అయితే, మెల్నో పార్క్​, కాలిఫోర్నియా వంటి నగరాల్లో.. ఓ మామూలు ఇల్లు అద్దె కొనాలంటే రూ. 1.82 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అద్దెలూ అదే స్థాయిలో ఉంటాయి.

గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ ‘వర్క్ ఫ్రమ్​ హోమ్’​ చేస్తే ఇంటి అద్దెలు, ఇతర ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి. అప్పుడు, జీతం కాస్తో కూస్తో మిగులుతుంది. అందుకే దాదాపు అందరు ఉద్యోగులు అటువైపే అడుగులు వేస్తున్నారు.

45% ఉద్యోగులు అవకాశం వస్తే కచ్చితంగా మరో చోటుకు మారతామంటున్నారని ఫేస్​బుక్​ నిర్వహించిన అంతర్గత సర్వేలో తేల్చారు. అయితే 30% మాత్రం.. వెళ్తే వెళ్తాం లేదంటే లేదనుకుంటున్నారు. 60% ఉద్యోగులు మరోచోటుకు మారాల్సివస్తే.. చిన్న పట్టణాలకు మారాలనుకుంటున్నారు. ఈ సర్వే ఆధారంగా, చోటు మారినా మీకు మిగిలేదేమీ లేదని ఉద్యోగులకు మార్క్ సవివరంగా తెలియజేశారు ​.

Follow Us:
Download App:
  • android
  • ios