Asianet News TeluguAsianet News Telugu

మాకు ఎలాంటి రాజకీయ పార్టీతో సంబంధం లేదు: ఫేస్‌బుక్

 "ద్వేషపూరిత సంభాషణలు, హింసను ప్రేరేపించే కంటెంట్‌ను మేము నిషేధించాము. ఎ రాజకీయ పార్టీతో  సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా మేము ప్రపంచ విధానాలను అమలు చేస్తాము." అని ఫేస్‌బుక్  ప్రతినిధి అన్నారు. 

Facebook denies ties with BJP, says company prohibits content that incites violence in india
Author
Hyderabad, First Published Aug 17, 2020, 1:52 PM IST

అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ (బిజెపి) తో పొత్తు పెట్టుకున్న రాజకీయ నాయకుల ద్వేషపూరిత ప్రసంగాలకు సోషల్ మీడియా సంస్థ అనుమతి ఇచ్చిందన్న ఆరోపణలపై  ఫేస్‌బుక్ ఆదివారం స్పందించింది.

"ద్వేషపూరిత సంభాషణలు, హింసను ప్రేరేపించే కంటెంట్‌ను మేము నిషేధించాము. ఎ రాజకీయ పార్టీతో  సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా మేము ప్రపంచ విధానాలను అమలు చేస్తాము." అని ఫేస్‌బుక్  ప్రతినిధి అన్నారు.

శుక్రవారం అంతర్జాతీయ దినపత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ లో ఫేస్‌బుక్  విద్వేష ప్రసంగ విధానాన్ని, ముస్లిం వ్యతిరేక పోస్టులను అనుమతించడం, భారతదేశంలో ఫేస్‌బుక్  పనితీరు పక్షపాతమని ఆరోపించింది.

also read వాట్సాప్ కి పోటీగా టెలిగ్రామ్ కొత్త ఫీచర్.. ...

ఇందుకు బిజెపి తెలంగాణ ఎంపి టి రాజా సింగ్ ఒక ఉదాహరణ. రోహింగ్యా ముస్లిం వలసదారుల గురించి ఆయన చేసిన ప్రకటనను ఉదహరించారు. భారతదేశంలోని ఫేస్‌బుక్ టాప్ ఎగ్జిక్యూటివ్ అంకి దాస్, అధికార బిజెపి సభ్యుల ద్వేషపూరిత సంభాషణ నిబంధనలను వ్యతిరేకించారని వారు పేర్కొన్నారు.

ఈ వార్తా ఇప్పుడు దేశంలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిల మధ్య చిచ్చు తెచ్చిపెట్టింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తూ "భారతదేశంలో బిజెపి, ఆర్ఎస్ఎస్ ఫేస్‌బుక్ మరియు వాట్సాప్లను నియంత్రిస్తాయి.

4వారు దాని ద్వారా నకిలీ వార్తలు, ద్వేషాలను వ్యాప్తి చేసి ఓటర్లను ప్రభావితం చేయడానికి ఉపయోగిస్తున్నారు " ఇలా అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios