Asianet News TeluguAsianet News Telugu

ఫస్ట్ టైం 100 బిలియన్‌ డాలర్ల క్ల‌బ్‌లోకి ఫేస్‌బుక్ సి‌ఈ‌ఓ..

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం 36 ఏళ్ల  మార్క్ జుకర్‌బర్గ్ టెక్ దిగ్గజాలు జెఫ్ బెజోస్, బిల్ గేట్స్‌తో కలిసి ప్రస్తుతం సెంటిబిలియనీర్ హోదాను దక్కించుకున్నాడు. యుఎస్ ఆర్థిక వ్యవస్థ రికార్డు స్థాయిలో వేగంగా దెబ్బతిన్నప్పటికి, అమెరికా అతిపెద్ద టెక్నాలజి సంస్థల వ్యవస్థాపకులు ఈ సంవత్సరం అధిక సంపదను కూడబెట్టుకున్నారు.

facebook ceo Mark Zuckerberg net worth passed $100 billion for the first time
Author
Hyderabad, First Published Aug 7, 2020, 3:37 PM IST

ఫేస్‌బుక్ ఇంక్.  టిక్‌టాక్ కు పోటీగా రీల్స్ ఫీచర్ విడుదల చేశాక రికార్డు స్థాయిలో మార్క్ జుకర్‌బర్గ్ నికర విలువ గురువారం తొలిసారిగా 100 బిలియన్లను దాటింది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం 36 ఏళ్ల  మార్క్ జుకర్‌బర్గ్ టెక్ దిగ్గజాలు జెఫ్ బెజోస్, బిల్ గేట్స్‌తో కలిసి ప్రస్తుతం సెంటిబిలియనీర్ హోదాను దక్కించుకున్నాడు.

యుఎస్ ఆర్థిక వ్యవస్థ రికార్డు స్థాయిలో వేగంగా దెబ్బతిన్నప్పటికి, అమెరికా అతిపెద్ద టెక్నాలజి సంస్థల వ్యవస్థాపకులు ఈ సంవత్సరం అధిక సంపదను కూడబెట్టుకున్నారు. ఈ సంవత్సరం మార్క్ జుకర్‌బర్గ్ 22 బిలియన్ డాలర్లు సంపాదించగా, బెజోస్ 75 బిలియన్ డాలర్లకు పైగా సంపాదించారు.

ఐదు అతిపెద్ద అమెరికన్ టెక్ కంపెనీలు ఆపిల్, అమెజాన్.కామ్ ఇంక్, ఆల్ఫాబెట్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్  ప్రస్తుతం యు.ఎస్ దేశ జాతీయ ఊత్పత్తిలో 30% కు సమానమైన మార్కెట్ విలువలను కలిగి ఉన్నాయి. యు.ఎస్. సెనేటర్ బెర్నీ సాండర్స్  కరోనా వైరస్ సంక్షోభ సమయంలో "అబ్సిన్  వెల్త్  గెన్స్" అని పిలిచే పన్నును రూపొందించడానికి చట్టాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.

also read చైనాకు గట్టి షాకిచ్చిన ఆపిల్.. ఏకంగా 29,800 చైనీస్ యాప్స్‌ బ్యాన్.. ...

"మేక్ బిలియనీర్స్ పే యాక్ట్" మార్చి 18 నుండి సంవత్సరం చివరి వరకు అత్యధిక సంపన్నుల నికర విలువలో 60% పన్నును వసూలు చేస్తుంది. ఆదాయాన్ని అమెరికన్ల ఆరోగ్య సంరక్షణ ఖర్చులను భరించటానికి ఉపయోగిస్తుంది.

2004లో తన హార్వర్డ్ విశ్వవిద్యాలయం వసతి గది నుండి సోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ ను మార్క్ జుకర్‌బర్గ్ స్థాపించాడు. విదేశాలలో కూడా టెక్ దిగ్గజాలు ఈ సంవత్సరం అత్యధిక లాభాలను ఆర్జించాయి.

టెన్సెంట్ హోల్డింగ్స్ లిమిటెడ్ సిఇఒ పోనీ మా తన సంపదను 55 బిలియన్ డాలర్లకు చేర్చి, పిండుడువో ఇంక్ కోలిన్ హువాంగ్ సంపద 13 బిలియన్ డాలర్ల నుండి 32 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డిజిటల్ యూనిట్ ఫేస్ బుక్, సిల్వర్ లేక్ వంటి సంస్థల నుండి పెట్టుబడులు పొందడంతో భారతదేశ ముఖేష్ అంబానీ 22 బిలియన్ డాలర్ల ధనవంతుడు అయ్యాడు. అతని విలువ ఇప్పుడు 80.3 బిలియన్లు.

Follow Us:
Download App:
  • android
  • ios