Asianet News TeluguAsianet News Telugu

ఒక్క రోజులో 53 వేల కోట్లు నష్టపోయిన ఫేస్‌బుక్...

ఫేస్‌బుక్ ఇంక్ నెట్‌వర్క్ నుండి పలు కంపెనీలు యాడ్స్ విరమించుకున్న తరువాత మార్క్ జుకర్‌బర్గ్ సంపద 7.2 బిలియన్ డాలర్లు తగ్గింది. ప్రపంచంలోని అతిపెద్ద అడ్వటైజర్ లో ఒకరైన యునిలివర్, సోషల్ మీడియా నెట్‌వర్క్‌లో ప్రకటనలను బాయ్ కాట్ చేసిన తరువాత ఫేస్‌బుక్  షేర్లు శుక్రవారం 8.3% పడిపోయాయి.

facebook ceo loses $7 billion dollars as companies boycott facebook ads
Author
Hyderabad, First Published Jun 27, 2020, 3:26 PM IST

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్  53 వేల కోట్ల రూపాయల సంపద ఒక్క రోజులోనే ఆవిరయ్యింది. నకిలీ వార్తలు, విద్వేషపూరిత పోస్టుల కట్టడికి సరైన చర్యలు తీసుకోవడం లేదన్న కారణంతో పలు కంపెనీలు ఫేస్​బుక్​కు ఇస్తున్న యాడ్స్​ను నిలిపేశాయి.

ఫేస్‌బుక్ ఇంక్ నెట్‌వర్క్ నుండి పలు కంపెనీలు యాడ్స్ విరమించుకున్న తరువాత మార్క్ జుకర్‌బర్గ్ సంపద 7.2 బిలియన్ డాలర్లు తగ్గింది. ప్రపంచంలోని అతిపెద్ద అడ్వటైజర్ లో ఒకరైన యునిలివర్, సోషల్ మీడియా నెట్‌వర్క్‌లో ప్రకటనలను బాయ్ కాట్ చేసిన తరువాత ఫేస్‌బుక్  షేర్లు శుక్రవారం 8.3% పడిపోయాయి.

ఈ సంవత్సరం ఫేస్‌బుక్ పై డబ్బులు ఖర్చు చేయడం ఆపేస్తానీ యునిలివర్ తెలిపింది. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఫేస్‌బుక్ మార్కెట్ వాల్యూ నుండి షేర్-ధరలు 56 బిలియన్లకు పడిపోయింది. మార్క్ జుకర్‌బర్గ్ నికర విలువ 82.3 బిలియన్లకు చేరింది.

దీంతో  మూడో స్థానంలో ఉన్న ఫేస్‌బుక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్థానం నాల్గవ స్థానానికి పడిపోయింది. నాలుగువ స్థానంలో ఉన్న లూయిస్ విట్టన్ బాస్ బెర్నార్డ్ ఆర్నాల్ట్ మార్క్ జుకర్‌బర్గ్ స్థానాని అధిగమించి, జెఫ్ బెజోస్, బిల్ గేట్స్‌తో పాటు ప్రపంచంలోని ముగ్గురు ధనవంతులలో ఒకరిగా నిలిచారు.

వెరిజోన్ కమ్యూనికేషన్స్ ఇంక్ నుండి హెర్షే.కో వరకు ఉన్నపలు కంపెనీలు సోషల్ మీడియాలో ప్రకటనలను నిలిపివేసాయి. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్న  అరికట్టడంలో ఫేస్‌బుక్ విఫలమైందని విమర్శకులు తెలిపారు.

అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తమ అన్ని ప్రకటనలను 30 రోజులు వరకు  నిలిపివేస్తున్నామని  కోకాకోలా కో తెలిపింది. ఫేస్‌బుక్ లో తప్పుడు సమాచారం గురించి పెరుగుతున్న విమర్శలకు మార్క్ జుకర్‌బర్గ్ శుక్రవారం స్పందిస్తూ, అన్ని రకాల ఓటింగ్ సంబంధిత పోస్టులకు కొత్త ఓటరు సమాచారం అనే లింకును జోడిస్తామని ప్రకటించింది. "నేను ఈ రోజు ఇక్కడ ప్రకటించే విధానాలలో రా జకీయ నాయకులకు మినహాయింపులు లేవు" అని జుకర్‌బర్గ్ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios