ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఫ్లిప్‌స్టార్ట్ డేస్ సేల్ ను రేపటి నుండి అంటే 1 డిసెంబర్ 2020 నుండి ప్రారంభమవుతుంది. ఈ సేల్ లో ఎలక్ట్రానిక్ ఉపకరణాలపై 80 శాతం వరకు టీవీలు, ఎసిలు, రిఫ్రిజిరేటర్లపై 50 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది.

అంతేకాకుండా బట్టలు, పాదరక్షలు, ఉపకరణాలు, బ్యూటీ, క్రీడలు, ఫర్నిచర్, హోమ్ డేకర్స్ ఇతర వాటిపై డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ఫ్లిప్‌స్టార్ట్ డేస్ సేల్ నెలలో మొదటి 3 రోజులలో ఉంటుంది.  

ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో ఫ్లిప్‌స్టార్ట్ సేల్ కోసం ఒక ప్రత్యేకమైన పేజీని పెట్టింది, ఈ సేల్ డిసెంబర్ 1 మంగళవారం ప్రారంభమై డిసెంబర్ 3 వరకు అంటే 3 రోజులు కొనసాగుతుంది.

ఫ్లిప్‌కార్ట్ ఫ్లిప్‌స్టార్ట్ డేస్ సేల్ లో హెడ్‌ఫోన్‌లు, స్పీకర్లపై  70 శాతం వరకు తగ్గింపు ఇస్తుంది. బెస్ట్ సెల్లింగ్ ల్యాప్‌టాప్‌ల కొనుగోలుపై 30 శాతం వరకు తగ్గింపును స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్‌లు వంటి ధరించే వస్తువులను సేల్ సమయంలో రూ.1,299 నుండి ప్రారంభ ధరతో అందిస్తుంది.

also read ఎయిర్‌టెల్ 5జి‌బి ఫ్రీ డేటా ఆఫర్.. ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నవారికి మాత్రమే.. ...

ఈ సేల్ లో జీరో ఈ‌ఎం‌ఐ ఆప్షన్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు ఉండవు కానీ అదనపు వారంటీతో వస్తాయి. అలాగే సేల్ సమయంలో స్మార్ట్ టీవీల ధర రూ.8,999 నుండి ప్రారంభమవుతాయి.

మీకు కావలసినవి పొందడానికి సులభతరం చేయడానికి ప్రస్తుతం సేల్ సమయంలో కొనుగోలు చేయాలనుకుంటున్న ప్రాడక్ట్ లిస్ట్ చేయడానికి ఫ్లిప్‌కార్ట్ అనుమతిస్తుంది. మీరు హోమ్ సెటప్ కోసం ఆలోచిస్తున్నట్లయితే ఆఫీస్ కుర్చీలు, ల్యాప్‌టాప్ టేబుళ్లపై బెస్ట్ డీల్స్ అందిస్తుంది.

ఫ్లిప్‌కార్ట్ ఫ్లిప్‌స్టార్ట్ డేస్ సేల్ సమయంలో మొబైల్ అసెసోరిఎస్ రూ. 129 నుండి ప్రారంభమవుతాయి. రిఫ్రిజిరేటర్లు, టీవీలపై 40 శాతం తగ్గింపు అందిస్తుంది.