ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎంఓఐ) తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా సిల్క్ మార్క్ లేబుల్ ఉత్పత్తులతో అమెజాన్ ప్రత్యేకమైన సిల్క్ మార్క్ స్టోర్ను ప్రారంభించనుంది.

వినియోగదారులకు చీరలు, దుస్తుల సామగ్రి, సల్వార్ కమీజ్ సెట్లు, కండువాలు, స్టోల్స్, జాకెట్లు, చొక్కాలు వంటివి 100% స్వచ్ఛమైన పట్టు ఉత్పత్తులకు సిల్క్ మార్కు హామీ లభిస్తుంది.  సిల్క్ ఆర్గనైజేషన్లో నమోదైన వివిధ చేనేత, తదితర కళాకారులకు చెందిన పలు ప్రొడక్టులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలియజేసింది.

దేశవ్యాప్తంగా సిల్క్ మార్క్ ను వినియోగించేందుకు 4,200 మది కళాకారులు అర్హత కలిగి ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. 

 ఎంవోయూలో భాగంగా తొలి దశలో 100 శాతం ప్యూర్ సిల్క్ తో తయారైన చీరలు, డ్రెస్ మెటీరియల్స్, సల్వార్ కమీజ్ సెట్స్, జాకెట్లు, షర్టులు తదితర 3,000 ప్రొడక్టులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అమెజాన్ తెలియజేసింది.

ఒప్పందంలో భాగంగా అమెజాన్ కారిగర్, అమెజాన్ ఇండియా బజార్ స్టోర్ల ద్వారా ప్యూర్ సిల్క్ ఉత్పత్తులను అమెజాన్ విక్రయించనున్నట్లు కేంద్ర సిల్క్ బోర్డ్ సీఈవో రంజన్ ఖాండియర్ పేర్కొన్నారు. తద్వారా దేశవ్యాప్తంగా ప్యూర్ సిల్క్ లేబుళ్లుగల ప్రొడక్టులను ప్రజలకు అందించే వీలున్నదని తెలియజేశారు.

డిజిటల్ ఇండియాలో భాగంగా అమెజాన్తో ఎంవోయూ కుదుర్చుకున్నట్లు తెలియజేశారు. కేంద్ర సిల్క్ బోర్డు ద్వారా జారీ అయ్యే సిల్క్ మార్క్ సర్టిఫికేషన్లో భాగంగా హాలోగ్రామ్, ప్రత్యేక నంబరుతో ఈ ప్రొడక్టులు లభిస్తాయని తెలియజేశారు.

ఎస్‌ఎం‌ఓ‌ఐ ద్వారా ఉత్పత్తులను విక్రయించేవారికి మార్కెటింగ్, సేల్స్ సపోర్ట్, సాంకేతిక శిక్షణ తదితర అంశాలలో మద్దతు లభిస్తుందని అమెజాన్ వివరించింది.

సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యం గురించి అమెజాన్ ఇండియా హెడ్ ప్రణవ్ భాసిన్ మాట్లాడుతూ “చేతివృత్తులవారు, చేనేత కార్మికులు మన సమాజంలో ఒక ముఖ్య భాగం. అమెజాన్  అన్ని రకాల భారతీయ చేతిపనులని ఆన్‌లైన్‌లోకి తీసుకురావడానికి, వినియోగదారుల ఎంపికను విస్తరించడానికి మా మిషన్‌లో చేతివృత్తులవారు, నేత కార్మికుల వృద్ధిని ప్రోత్సహించడమే మా  దృష్టి. చిన్న, మధ్యతరహా అమ్మకందారులను ఆన్‌లైన్ అమ్మకాలను వారి వ్యాపారాన్ని విస్తరించడానికి మేము దృష్టి సారించాము.

మా అసోసియేషన్ ద్వారా సిల్క్ మార్క్ లేబుల్ ఉత్పత్తులను ప్రారంభించడం ద్వారా భారతదేశం అంతటా వేలాది మంది నేత కార్మికులు ఆన్‌లైన్‌లో విక్రయించడానికి, కోట్లాది మంది అమెజాన్ కస్టమర్లను చేరుకోవడానికి వీలు కల్పిస్తుంది. ” అని అన్నారు.

సిల్క్ మార్క్ సర్టిఫికేషన్ అనేది సెంట్రల్ సిల్క్ బోర్డ్, టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం యొక్క చొరవ. సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ఉత్పత్తులు సిల్క్ మార్క్ లేబుల్‌తో వస్తాయి. అమెజాన్.ఇన్ 25 ప్రభుత్వ ఎంపోరియంలు, 5 ప్రభుత్వ సంస్థలతో భాగస్వామ్యం చేసుకుంది.