ప్రముఖ ఈ-కామర్స్ స్టోర్లో ఉద్యోగాలు... 5వేల మందికి అవకాశం...
మైంట్రా ఎండ్ ఆఫ్ రీజన్ సేల్: ఈ సేల్స్ సమయంలో మైంట్రా ఉద్యోగులు ఇంటి నుండి పని చేయడం ఇదే మొదటిసారి. మొత్తం ఈఓఆర్‌ఎస్ ఈవెంట్‌ను లైవ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఒకరితో ఒకరు కనెక్ట్ అవడం ద్వారా ఉద్యోగులు డిజిటల్‌గా పని చేయనున్నారు.
ప్రముఖ ఇండియన్ ఫ్యాషన్ ఈ కామర్స్ స్టోర్, ఆన్‌లైన్ ఫ్యాషన్, లైఫ్ స్టైల్ స్టోర్ మైంట్రాలో సప్లై చైన్, కస్టమర్ కేర్ విభాగాలలో సుమారు 5,000 మంది ఉద్యోగులను నియమించుకునున్నట్లు తెలిపింది. జూన్ 19న నుంచి ప్రారంభం కానున్న 12వ ఎడిషన్ 'ఎండ్ ఆఫ్ రీజన్ సేల్'(ఈఓఆర్‌ఎస్) కోసం ఈ నియమకాలను చేసుకున్నది. ఈ సెల్ జూన్ 22తో ముగుస్తుంది.
సేల్స్ సమయంలో మైంట్రా ఉద్యోగులు ఇంటి నుండి పని చేసే అవకాశం కల్పించడం ఇదే మొదటిసారి. మొత్తం ఈఓఆర్‌ఎస్ ఈవెంట్‌ను లైవ్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఒకరితో ఒకరికి కనెక్ట్ చేయడం ద్వారా ఉద్యోగులు డిజిటల్‌గా పని చేయనున్నారు.
ఎండ్ ఆఫ్ రీజన్ సేల్ సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న స్టోర్లలో 3,000 పైగా బ్రాండ్లు, 7 లక్షలకు పైగా కలక్షన్స్ అందుబాటులో ఉన్నాయి. సేల్స్ సమయంలో 30 లక్షల మంది కస్టమర్లు తమ ప్లాట్‌ఫామ్‌లో షాపింగ్ చేస్తుండొచ్చని మైంట్రా ఆశిస్తోంది.
ఫ్యాషన్ ఎసెన్షియల్స్, మహిళల ఎత్నిక్ వేర్, పిల్లల దుస్తులు, యాక్టివ్, స్పోర్ట్ వేర్, బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ వంటివి లాక్ డౌన్ మొదటి దశలో వృద్ధిని సాధించాయని, ఈఓఆర్‌ఎస్ సమయంలో సేల్స్ కూడా మరింత పెరుగుతాయని మైంట్రా సీఈఓ అమర్ నాగరం చెప్పారు.
also read నిరుద్యోగులకు గుడ్‌న్యూస్...ప్రముఖ ఐటి కంపెనీలో కొత్తగా 400 ఉద్యోగాలు.. ...
"మా బృందాలు గరిష్ట సమయంలో నిమిషానికి 20వేల ఆర్డర్‌లను హ్యాండిల్ చేయడానికి సన్నద్ధమవుతున్నాయి, గరిష్టంగా 7.5 లక్షలకు పైగా వినియోగదారులు ఈఓఆర్‌ఎస్ 12వ ఎడిషన్‌లో 3 మిలియన్ల మంది షాపింగ్ చేయనున్నట్లు మేము ఆశిస్తున్నాము" అని నాగరం చెప్పారు.
మొత్తం 300 నగరాలలో 75 శాతం డెలివరీలను 15 వేల డీలర్షిప్ పార్ట్ నర్లు అందించనున్నట్లు సీఈఓ తెలిపారు. 400కి పైగా బ్రాండ్ల నుండి 3,500 కు పైగా భారతీయ చేనేత ఉత్పత్తులను అందిస్తున్నట్లు నాగరం చెప్పారు.
అంతేకాకుండా ఫ్యాషన్ ఇ-టైలర్ మైంట్రా కూడా "రీఛార్జ్ లీవ్"ను కూడా ప్రవేశపెట్టింది, ఇది సేల్స్ ముగించిన తర్వాత ఉద్యోగులందరికీ రెండు రోజుల పాటు సెలవు కూడా ఇవ్వనుంది. అంతకుముందు సేల్స్ ఎడిషన్‌లో 2.85 మిలియన్ల కస్టమర్లు 9.6 మిలియన్ వస్తువులపై 4.2 మిలియన్ ఆర్డర్‌లను చేశారు అని తెలిపింది.