ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ లెనోవా కొత్త స్మార్ట్‌ఫోన్ లెనోవా లెజియన్ ఫోన్ డ్యుయల్ ను త్వరలో భారత్‌లో లాంచ్ చేయనుంది. లెనోవా లెజియన్ ఫోన్ డ్యుయల్ కంపెనీ ఇండియన్ వెబ్‌సైట్‌లో జాబితా చేసింది.

కానీ ధర, లభ్యత గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. లెనోవా లెజియన్ ఫోన్ డ్యుయల్ ఈ సంవత్సరం జూలైలో ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయిన గేమింగ్ స్మార్ట్‌ఫోన్, కానీ భారత మార్కెట్లో లాంచ్ చేయలేదు. ఈ సంవత్సరంలో గేమింగ్ ఫోన్ గురించి అందరూ ఎక్కువగా మాట్లాడేది ఈ ఫోన్ గురించే.

 లెనోవా లెజియన్ ఫోన్ డ్యుయల్ స్పెసిఫికేషన్లు

ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 10 జెడ్‌యూ‌ఐ 12 ఓఎస్ తో వస్తుంది. దీని సహాయంతో, మీరు గేమింగ్ ఆడేటప్పుడు ఇతర గేమర్‌లతో మాట్లాడవచ్చు. ఇది ఆరు పర్సనలైజేడ్ లేఅవుట్లను పొందుతుంది. ఈ ఫోన్‌లో హోమ్ మోడ్ కూడా ఉంది, దీని ద్వారా మీరు గేమ్ ము మానిటర్‌లో ప్రసారం చేయవచ్చు.

ఫోన్‌లో లెజియన్ అసిస్టెంట్ కూడా ఉంది, ఇది వర్చువల్ జాయ్ స్టిక్, గేమ్‌ప్యాడ్ కంట్రోల్స్ కోసం ఉపయోగపడుతుంది. లెనోవా లెజియన్ ఫోన్ డ్యూయల్  రిఫ్రెష్ రేట్ ఆడియో టు వైబ్రేషన్ (A2V) కూడా ఉంది.

also read ఐఫోన్12 కంటే తక్కువ ధరకే ఐఫోన్‌13.. ఇంటర్నెట్ లో ఫీచర్లు హల్‌చల్‌.. ...

లెనోవాకు చెందిన ఈ ఫోన్‌లో 6.65 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్ప్లే 2340x1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌,  డిస్ ప్లేలో ఏ‌ఎం‌ఓ‌ఎల్‌ఈ‌డి ప్యానెల్, 144Hz రిఫ్రెష్ రేట్ ఉంది, టచ్ శాంప్లింగ్ రేటు 240Hz.  క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 865+ ప్రాసెసర్, 16 జీబీ వరకు ర్యామ్, 256జీబీ, 512జీబీ యూ‌ఎఫ్‌ఎస్ 3.1 స్టోరేజ్ ఆప్షన్స్  ఉన్నాయి.

కెమెరా విషయానికొస్తే, కంపెనీ దానిలో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఇచ్చింది, దీనిలో ప్రధాన కెమెరా 64 మెగాపిక్సెల్స్, మరొకటి 16 మెగాపిక్సెల్స్. సైడ్ పాపప్ సెల్ఫీ తో 20 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు.  

90W ఛార్జింగ్

ఫోన్‌లో 5జి, 4జి ఎల్‌టిఇ, వై-ఫై 6, బ్లూటూత్ వి5.0, జిపిఎస్/ఎ-జిపిఎస్, ఎన్‌ఎఫ్, రెండు యుఎస్‌బి టైప్-సి పోర్ట్‌లు ఉంటాయి. ఫోన్‌లో ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్లు ఉన్నాయి. లెనోవా లెజియన్ ఫోన్ డ్యూయల్‌లో 3డి మోషన్ సెన్సార్ ఉంటాయి.

ఇది కాకుండా దీనికి  రెండు డ్యూయల్ ఫ్రంట్ ఫేసింగ్ స్టీరియో స్పీకర్లు, రెండు 2500 ఎమ్ఏహెచ్ బ్యాటరీలు ఉన్నాయి, 90W టర్బో పవర్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. 10 నిమిషాల ఛార్జింగ్‌లో 50% బ్యాటరీ, 30 నిమిషలలో ఫుల్ చార్జ్  అవుతుందని పేర్కొంది. ఫోన్ బరువు 239 గ్రాములు.