చైనా యాప్ షేర్‌ఇట్‌కు ప్రత్యామ్నాయంగా సరికొత్త యాప్ వచ్చేసింది..
నిషేధించబడిన చైనీస్ యాప్స్ కి ప్రత్యామ్నాయంగా ఉండే భారతదేశ ఆధారిత యాప్ డౌన్ లోడ్స్ పెరిగాయి. నిషేధించిన 59 చైనా యాప్స్ లో ఫైల్స్ షేరింగ్ యాప్ షేర్ ఈట్ కూడా ఉంది. ఇది చాలా సులభంగా ఫైల్స్ ఒక మొబైల్ నుండి మరొక మొబైల్ కి పంపించడానికి సహాయపడుతుంది.
భారతదేశంలో ఇటీవల 59 చైనీస్ యాప్‌లపై నిషేధం విధించిన నేపథ్యంలో భారతదేశంలో తయారైన యాప్‌ల వినియోగం భారీగా పెరుగుతోంది. నిషేధించబడిన చైనీస్ యాప్స్ కి ప్రత్యామ్నాయంగా ఉండే భారతదేశ ఆధారిత యాప్ డౌన్ లోడ్స్ పెరిగాయి. నిషేధించిన 59 చైనా యాప్స్ లో ఫైల్స్ షేరింగ్ యాప్ షేర్ ఈట్ కూడా ఉంది.
ఇది చాలా సులభంగా ఫైల్స్ ఒక మొబైల్ నుండి మరొక మొబైల్ కి పంపించడానికి సహాయపడుతుంది. షేర్ ఈట్ కి ప్రత్యామ్నాయంగా భారతదేశంలో ఇటీవల అభివృద్ధి చేసిన డోడో డ్రాప్ ఫైల్ షేరింగ్ యాప్ వచ్చేసింది. దీనిని జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జిల్లాకు చెందిన అష్ఫాక్ మెహమూద్ చౌదరి అనే 17 ఏళ్ల బాలుడు అభివృద్ధి చేశాడు.
భారతదేశంలో ఈ కొత్త యాప్ వినియోగదారులకు చాలా సులభంగా షేర్ ఈట్ లాగే ఫైల్స్ సులభంగా పంపించడానికి సహాయపడుతుంది అని అష్ఫాక్ చెప్పారు. అష్ఫక్ తండ్రి పర్వేజ్ అహ్మద్ చౌదరి మాట్లాడుతూ "మేము అతడికి మద్దతు ఇస్తున్నాం. అష్ఫక్ కొన్ని ప్రాజెక్టుల్లో పనిచేయడం ద్వారా సొంతంగా డబ్బు సంపాదించాడు దాన్ని యాప్ అభివృద్దికి ఉపయోగించుకుంటున్నాడు. మేము అతడికి ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటాం’’ అని అన్నారు.
also read వాట్సాప్ ద్వారా కూడా డబ్బులు పంపొచ్చు.. ఎలా అనుకుంటున్నారా..? ...
డోడో డ్రాప్ యాప్ వివరాలు
ఇంటర్నెట్ సదుపాయంతో రెండు స్మార్ట్ ఫోన్స్ మధ్య ఆడియోలు, సినిమాలు, వీడియోలును షేర్ చేయడానికి డోడో డ్రాప్ యూసర్లకు అనుమతిస్తుంది. ఈ యాప్ అభివృద్ధి చేయడానికి అతనికి నాలుగు వారాలు పట్టిందని పేర్కొన్నారు.
ఇది 480Mbps వరకు డాటా ట్రాన్స్ఫర్ రేటును కలిగి ఉంది, ఇది షేర్ ఈట్ కంటే వేగంగా ఉంటుంది. ఇంకా ఇది ఉపయోగించడానికి కూడా చాలా సులభంగా ఉంటుంది. ట్రాన్స్ఫర్ చేసిన డేటా పూర్తిగా సురక్షితంగా ఉంటుంది.
భారతీయ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌లలో మొబైల్ యాప్స్ డాటా దుర్వినియోగం గురించి అనేక ఫిర్యాదులను అందుకుంది. చైనా యాప్‌లను కూడా ప్రభుత్వం నిషేధించడానికి కూడా ఇది ఒక కారణం.
దీనిని అనుసరించి, భారత ప్రధానమంత్రి విదేశీ యాప్స్, ఉత్పత్తులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారతదేశ ఆధారిత యాప్స్ అభివృద్ధిపై దృష్టి పెట్టలకి సూచించారు. అలాగే, భారతదేశంలో డెవలపర్‌లు వారి స్వంత యాప్స్ తో ముందుకు రావడానికి ప్రేరేపించే ఒక గొప్ప చొరవ ఇది.