Asianet News TeluguAsianet News Telugu

షియోమి కీలక నిర్ణయం.. గ్రామీణ ప్రాంతాలు లక్ష్యంగా"ఎంఐ స్టోర్-ఆన్-వీల్స్"ప్రారంభం

ఈ కొత్త కార్యక్రమం ద్వారా దేశంలోని  గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు కూడా మా ‌ప్రాడెక్ట్స్ విక్రయాలను విస్తరించాలని భావిస్తోందని కంపెనీ తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా వినియోగదారులు ఎక్కువగా తమ ఇళ్లకు  మాత్రమే పరిమితం కావడంతో  దేశంలోని అనేక ఆఫ్‌లైన్ రిటైల్ దుకాణాలు ప్రభావితమయ్యాయి.  

china smartphone maker Xiaomi Launches 'Mi Store on Wheels' Moving Retail Shops in India
Author
Hyderabad, First Published Sep 22, 2020, 2:42 PM IST

చైనా స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ షియోమి ఎం‌ఐ స్టోర్ ఆన్ వీల్స్ అనే సరికొత్త కార్యక్రమాన్ని భారతదేశంలో ప్రారంభించింది. ఈ కొత్త కార్యక్రమం ద్వారా దేశంలోని  గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు కూడా మా ‌ప్రాడెక్ట్స్ విక్రయాలను విస్తరించాలని భావిస్తోందని కంపెనీ తెలిపింది.

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా వినియోగదారులు ఎక్కువగా తమ ఇళ్లకు  మాత్రమే పరిమితం కావడంతో  దేశంలోని అనేక ఆఫ్‌లైన్ రిటైల్ దుకాణాలు ప్రభావితమయ్యాయి.  అయితే ఈ కొత్త రిటైల్ వ్యూహంతో షియోమి ఆఫ్‌లైన్ స్టోర్ బృందం ఇప్పుడు సంస్థ రిటైల్ అనుభవాన్ని వినియోగదారులకు ముందుకు  తీసుకువస్తుంది.

షియోమి గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్, ఇండియా ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జైన్ ట్విట్టర్ ట్వీట్ ద్వారా ఎం‌ఐ స్టోర్ ఆన్ వీల్స్  కార్యక్రమం ఫోటోలను షేర్ చేశారు. ఫుడ్ వ్యాన్ లాగా రూపొందించిన ఎం‌ఐ స్టోర్ ఆన్ వీల్స్ వ్యాన్ వెనుక భాగంలో పాప్-అప్ స్టోర్ ఏర్పాటు చేశారు.

ఇందులో కంపెనీ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించడమే కాకుండా ఎం‌ఐ స్మార్ట్ టీవీలు, ఎం‌ఐ బాక్స్ 4కె, ఎం‌ఐ  టివి స్టిక్, ఎం‌ఐ  సిసిటివి కెమెరాలు, ఎం‌ఐ స్పోర్ట్స్ బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్, ఎం‌ఐ  ట్రూ వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్ 2, రెడ్‌మి ఇయర్‌బడ్స్ ఎస్, ఎం‌ఐ సన్‌గ్లాసెస్ , పవర్‌బ్యాంక్‌లు, ఛార్జర్‌లు ఉన్నాయి.

also read  15వేల కన్నా తక్కువ ధరకే లభించే బెస్ట్ స్మార్ట్ టీవిలు ఇవే.. ...

షియోమి ఉత్పత్తులను గ్రామాలు, మెట్రోయేతర నగరాల్లోని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును 40 రోజుల్లో పూర్తి చేసినట్లు జైన్ తెలిపారు. ఫోటోలో కనిపించే మొబైల్ వ్యాన్ పై ప్రత్యేకమైన సీరియల్ నంబర్‌ను ఉంది, ఇది కంపెనీ మొబైల్ స్టోర్లను ట్రాక్ చేస్తుంది.

ఎం‌ఐ ఇండియా సిఒఒ మురళీకృష్ణన్ ఒక ప్రకటనలో, “అతిపెద్ద ప్రత్యేకమైన సింగిల్ బ్రాండ్ రిటైల్ నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నందున ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాలకు చేరుకోవడానికి, వినియోగదారుల అవసరాలను తీర్చడానికి మేము నిశ్చయించుకున్నాము,

ఎం‌ఐ  స్టోర్ ఆన్ వీల్స్  ప్రజల మధ్య సామాజిక దూరాన్ని కొనసాగిస్తాయని, అవసరమైన అన్ని పరిశుభ్రత భద్రతా పద్ధతులను అనుసరిస్తాయని అన్నారు. ఎం‌ఐ స్టోర్స్ ఆన్ వీల్స్ కస్టమర్ల నుండి అభిప్రాయాన్ని కూడా తీసుకుంటాయి.

షియోమికి సంస్థ ఇటీవలే భారతదేశంలో మొట్టమొదటి స్మార్ట్ వాచ్ను ప్రారంభించినట్లు సూచించింది. స్మార్ట్ వాచ్ తో పాటు మరెన్నో ఐయోటి ఉత్పత్తులు సెప్టెంబర్ 29న జరిగే కంపెనీ స్మార్టర్ లివింగ్ 2021 కార్యక్రమంలో వెల్లడవుతాయని భావిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios