మీకు ఒప్పో స్మార్ట్ ఫోన్స్ అంటే ఇష్టమా.. ఒప్పో  స్మార్ట్‌ఫోన్ ను కొనాలని చూస్తున్నారా.. అయితే చైనా ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ  ఒప్పో పాపులర్ మోడల్ ఒప్పో స్మార్ట్ ఫోన్ పై ధర తగ్గింపును ప్రకటించింది. ఒప్పో స్మార్ట్‌ఫోన్ ఒప్పో ఎఫ్ 17 ప్రో ధరపై రూ.1,500 ప్రైస్ డ్రాప్ అందిస్తుంది.

ఒప్పో ఎఫ్ 17 ప్రోను ఇప్పుడు కేవలం రూ.21,490 కొనుగోలు చేయవచ్చు. ఇంతకు ముందు దీని ఎం‌ఆర్‌పి ధర రూ.22,990. ఒప్పో ఎఫ్ 17 ప్రో సెప్టెంబరు 2020లో భారతదేశంలో లాంచ్ చేశారు, ఆ తరువాత దాని ధర మొదటిసారి తగ్గించబడింది.

ఒప్పో ఎఫ్ 17 ప్రో స్పెసిఫికేషన్లు

ఒప్పో ఎఫ్ 17 ప్రోలో 6.43 అంగుళాల పూర్తి హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, 2400 × 1080 పిక్సెల్స్ రిజల్యూషన్‌, సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 90.7 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో, 60Hz రిఫ్రెష్ రేటు, ఆక్టాకోర్ మీడియా టెక్ హెలియో పి 95 ప్రాసెసర్‌ అందించారు.

ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేస్తుంది. కలర్ ఓఎస్ 7.2 ఇంటర్ ఫేస్ ఉంది. ఈ ఫోన్‌కు 8 జీబీ ర్యామ్‌తో 128 జీబీ స్టోరేజ్ లభిస్తుంది.

also read రిలయన్స్ జియో 5జిపై ముకేష్ అంబానీ కీలక ప్రకటన.. వచ్చే ఏడాదిలో బడ్జెట్ ధరకే 5జి సేవలు. ...

ఒప్పో ఎఫ్ 17 ప్రో కెమెరా

ఒప్పో ఎఫ్ 17 ప్రో వెనుక భాగంలో నాలుగు కెమెరాలు ఉంటాయి. దీని వెనుక భాగంలో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ కెమెరా, 2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ సెన్సార్ కెమెరా ఉంటాయి.

అలాగే సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ కెమెరా ఉన్నాయి.

ఒప్పో ఎఫ్ 17 ప్రో బ్యాటరీ అండ్ కనెక్టివిటీ

ఒప్పో ఎఫ్ 17 ప్రోలో 4015 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంది, 30W వూక్ ఫ్లాష్ ఛార్జ్ 4.0 ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ ఇస్తుంది. కనెక్టివిటీలో 4జి వివోల్‌టిఇ, వై-ఫై, బ్లూటూత్ వి5.1, జిపిఎస్ / ఎ-జిపిఎస్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, యుఎస్‌బి టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్‌లో ఇన్ డిస్ ప్లే  ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఫోన్ బరువు 164 గ్రాములు.