అన్ని టెలికాం ప్రొవైడర్లు ఈ మార్పు గురించి తెలియజేశామని, ఇందుకు అవసరమైన అన్ని మార్పులు చేసుకోవాలని జనవరి 1 గడువు ఇచ్చింది.
ల్యాండ్‌లైన్ వినియోగదారులందరు ఇకపై మొబైల్ ఫోన్ నంబర్‌లకు కాల్ చేయడానికి ముందు త్వరలో ‘0’ డయల్ చేయాల్సి ఉంటుందని టెలికమ్యూనికేషన్ విభాగం (డిఓటి) ప్రకటించింది. టెలికాం ప్రొవైడర్లకు ఈ కొత్త మార్పు గురించి తెలిపినట్లు, ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి జనవరి 1 గడువు ఇచ్చామని తెలిపింది.
ఈ కొత్త మార్పు గురించి వినియోగదారులకు తెలిసేలా అవగాహన చేయాలని ఒక ప్రకటనలో తెలిపింది, వారి ల్యాండ్‌లైన్ల నుండి ‘0’, అనగా ఎస్‌టిడీ కాలింగ్ సదుపాయాన్ని డయల్ చేసే నిబంధనను తీసుకురానుంది.
‘ఫిక్సెడ్ లైన్ నంబర్స్ నుండి సెల్యులార్ మొబైల్ నంబర్‌లకు డయలింగ్ ప్యాటర్న్ మోడిఫికేషన్’ పేరుతో ఒక ప్రకటనను డిఓటి విడుదల చేసింది. ల్యాండ్‌లైన్ నుండి మొబైల్ ఫోన్లకు కాల్ చేయడానికి ముందు ‘0’ ను ప్రిఫిక్స్ చేయమని ట్రాయ్ (టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) సిఫారసు చేసినట్లు తెలిపింది.
also read టెక్నో పోవా కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్ లాంచ్.. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఇండియన్ మార్కెట్లోకి.. ...
ప్రస్తుతం బేసిక్ లేదా ఫిక్సెడ్ ఫోన్‌ల నుండి ఇంటర్-సర్వీస్ ఏరియా మొబైల్ కాల్స్ కోసం ‘0’ డయల్ చేయడం ద్వారా కాల్స్ చేయవచ్చు. ఒక కాల్ కోసం '0' నెంబర్ డయలింగ్ ప్రవేశపెట్టడం టెలిఫోన్ నంబర్‌లోని అంకెల సంఖ్యను పెంచడానికి కాదని ట్రాయ్ నొక్కి చెప్పింది.
డయలింగ్ ప్యాటర్న్ మార్పు భవిష్యత్ అవసరాలను తీర్చడానికి, మొబైల్ సేవలకు 2,544 మిలియన్ అదనపు నంబర్లను ఉత్పత్తి చేస్తుంది ”అని రెగ్యులేటరీ అథారిటీ వివరించింది.
టెలికం సర్వీసు ప్రొవైడర్లకు టెలికమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్స్ (టిఎస్‌పి) ఈ మార్పును అమలు చేయడానికి జనవరి 1 గడువు ఇచ్చింది. ఫిక్స్‌డ్ లైన్ సబ్ స్క్రైబర్స్ కోసం ‘0 'డయలింగ్ సౌకర్యం కల్పించాలని, అంటే ఎస్టీడీ కాలింగ్ ఉండాలని డిఓటి తెలిపింది.
ఇంకా ఈ కొత్త మార్పును వినియోగదారులకు తెలిపేందుకు ఒక ప్రకటనను సృష్టించాలి అని వివరించింది. వినియోగదారులు ‘0’ ను డయల్ చేయకుండా మొబైల్ నంబర్ డయల్ చేసినప్పుడల్లా ఈ ప్రకటన వినిపించాలని టెలికమ్యూనికేషన్ విభాగం ఆదేశించింది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Nov 27, 2020, 6:41 PM IST