స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్న కస్టమర్ల కోసం వివో ఒక నమ్మకమైన ఆఫర్‌తో ముందుకు వచ్చింది. కేవలం రూ.101 చెల్లించి స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకునే అవకాశం కలిస్తుంది. పండగ సీజన్‌ను పురస్కరించుకుని మొబైల్‌ కంపెనీలు వివిధ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తు కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి.

దీపావళి పండుగ సందర్భంగా  స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ  వివో కూడా బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. 20ఎస్‌, వీ 20, ఎక్స్‌ 50 సీరిస్‌ స్మార్ట్‌ఫోన్లను రూ.101కే సొంతం చేసుకోవచ్చని తెలిపింది. ఐసీఐసీఐ, కోటక్, ఫెడరల్‌బ్యాంకు, బ్యాంక్ ఆఫ్‌ బరోడా కార్డుతో చేసే కొనుగోళ్లపై 10శాతం క్యాష్‌బ్యాక్‌ అందిస్తోంది.

also read యూట్యూబ్‌లో మళ్లీ హైక్వాలిటీ హెచ్‌డి వీడియోలు.. లాక్‌డౌన్‌ సడలింపుతో నిషేధం తొలగింపు.. ...  

దీపావళి ఆఫర్లతో కొత్త ఆనందాన్ని వెలిగించండి అంటూ వివో ట్విటర్ ద్వారా ట్వీట్‌ చేసింది. కేవలం రూ.101 చెల్లించి మీరు ఇష్టపడే వివో ఫోన్‌ను సొంతం చేసుకోండి. దీంతోపాటు  అదనపు ప్రయోజనాలను కూడా ఆస్వాదించండి అంటు  పేర్కొంది.

అయితే ఈ ఆఫర్ అందుబాటులో ఉండే తేదీలను వెల్లడించలేదు. అయితే మొదట రూ.101 డౌన్ పేమెంట్ చెల్లించి పైన పేర్కొన్న వాటిలో నచ్చిన స్మార్ట్‌ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. తరువాత ఫోన్‌ విలువ మొత్తాన్ని ఈజి ఈఎంఐ వాయిదాలలో చెల్లించాల్సి ఉంటుంది.