Asianet News TeluguAsianet News Telugu

రిలయన్స్ జియోకి పోటీగా బిఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త ప్లాన్.. రూ.300లోపు లభించే బెస్ట్ ప్లాన్స్ ఇవే..

భారతదేశంలో డేటా వినియోగం గత కొన్నేళ్లుగా పెరుగుతోంది, కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, దీని ఫలితంగా డేటా వినియోగం మరింత పెరిగింది. 

BSNL Work from Home Prepaid Plan of Rs 251 Offers 70GB Data for 28 Days check details here
Author
Hyderabad, First Published Dec 19, 2020, 1:33 PM IST

ప్రైవేట్ టెల్కోస్‌తో పోటీ పడటానికి బిఎస్‌ఎన్‌ఎల్ ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ప్రీపెయిడ్ ఎస్‌టివిని ప్రవేశపెట్టింది. భారతదేశంలో డేటా వినియోగం గత కొన్నేళ్లుగా పెరుగుతోంది, కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, దీని ఫలితంగా డేటా వినియోగం మరింత పెరిగింది.

స్టాండర్డ్ ప్రీపెయిడ్ ప్లాన్లు ప్రస్తుతం రోజువారీ డేటా ప్రయోజనాన్ని అందిస్తున్నందున ప్రైవేట్ టెల్కోలు కొన్ని సంవత్సరాల క్రితం డేటా  ప్లాన్లను తొలగించాయి. ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్ ఐడియాతో పాటు బిఎస్ఎన్ఎల్ రూ.56, రూ.151తో  రూ.251 ధరతో వర్క్ ఫ్రమ్ హోమ్ హోమ్ డేటా ఎస్టీవీలను తీసుకువచ్చింది.

ఇప్పుడు బిఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు 70 జిబి హై-స్పీడ్ డేటాతో మార్కెట్లోకి వర్క్ ఫ్రమ్ హోమ్  ప్రీ-పెయిడ్ ప్లాన్‌ను విడుదల చేసింది. ఈ ప్లాన్ ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్  చేస్తున్న వారికి ప్రయోజకరంగా ఉండేందుకు ప్రవేశపెట్టబడింది.

also read ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు షాక్‌.. సోషల్ మీడియాలో ఫిర్యాదులులతో పాటు ట్రోల్స్, మీమ్స్ ట్రెండింగ్.. ...

ఈ ప్లాన్ ధర 251 రూపాయలు. ఈ ప్లాన్ కింద డేటా మాత్రమే అందుబాటులో ఉంటుంది. దీనిలో మీరు మొత్తం 70 జీబీ డేటాను పొందుతారు, దాని వాలిడిటీ 28 రోజులు. ఈ ప్రణాళికతో మీకు కాలింగ్ లేదా ఎస్ఎంఎస్ వంటి సదుపాయలు లభించవు.

రూ .151 ప్లాన్‌తో  40 జీబీ డేటా

బిఎస్‌ఎన్‌ఎల్‌లో 151 రూపాయల ఎస్‌టివి ప్లాన్ తో  40 జిబి డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్  వాలిడిటీ కూడా 28 రోజులు. ఇది కూడా పూర్తి  డేటా ప్లాన్. బిఎస్ఎన్ఎల్ ఎస్‌టివితో జింగ్ మ్యూజిక్ యాప్  ఉచిత సభ్యత్వాన్ని కూడా  అందిస్తుంది.

రిలయన్స్ జియో గురించి మాట్లాడుతుంటే జియోలో రూ.151, రూ.201, రూ .251 డేటా ప్లాన్లు ఉన్నాయి, ఇవి వరుసగా 30 జిబి, 40 జిబి 50 జిబి డేటాను అందిస్తాయి. మీరు జియో ఇంకా బిఎస్ఎన్ఎల్ రూ.251 ప్లాన్‌ను పోల్చి చూస్తే మీకు 20జిబి అదనపు డేటా బి‌ఎస్‌ఎన్‌ఎల్ ద్వారా లభిస్తుంది. బిఎస్‌ఎన్‌ఎల్‌ రూ.56 ప్లాన్ పది రోజుల వాలిడిటీతో మొత్తం 10 జీబీ డేటా ఇస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios