భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) కస్టమర్లను ఆకర్షించడానికి వివిధ రిచార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. తాజాగా కస్టమర్లను మరింత ఆకర్షించెందుకు ఫ్రీ సిమ్ కార్డు ఆఫర్ ప్రకటించింది, అయితే ఇప్పుడు ఈ ఫ్రీ సిమ్ కార్డు ఆఫర్ ప్రమోషనల్ ఆఫర్‌గా అందిస్తోంది.

ఈ ఆఫర్ నవంబర్ 14 నుండి ప్రారంభంమై 15 రోజులు వరకు ఉంటుంది. ఈ ఆఫర్ అన్ని సర్కిల్‌లలో అందుబాటులో ఉంది.  ఫ్రీ సిమ్ కార్డ్ పొందిన తరువాత మీరు కనీసం 100 రూపాయల మొదటి రీఛార్జ్ (ఎఫ్ఆర్‌సి) చేయించుకోవాలి. కావాలంటే, మీ సౌలభ్యం ప్రకారం ఇతర ఎఫ్‌ఆర్‌సిలను కూడా చేసుకోవచ్చు.

ఈ ఆఫర్ పొందడానికి మీరు సమీపంలోని ఏదైనా బిఎస్ఎన్ఎల్ స్టోర్‌ను సందర్శించవచ్చు. ఫ్రీ సిమ్ కార్డ్ ఆఫర్ ముగిసిన తరువాత  మీరు కొత్త సిమ్ కార్డు కోసం ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది. జనవరి 2021 లో ఎం‌టి‌ఎన్‌ఎల్  లైసెన్స్ గడువు ముగియడంతో బి‌ఎస్‌ఎన్‌ఎల్ త్వరలో పాన్ ఇండియా ఆపరేటర్‌గా మారవచ్చు. 

also read శామ్‌సంగ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ పై భారీ తగ్గింపు.. కొద్ది రోజులు మాత్రమే.. ...

49 రూపాయల కొత్త ప్లాన్ బిఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్

  గత నెల సెప్టెంబర్‌లో 49 రూపాయల ప్రమోషనల్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్  సెప్టెంబర్ 1 నుండి వచ్చే 90 రోజుల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ ప్రణాళిక గురించి  చెన్నై సర్కిల్ వెబ్‌సైట్‌లో ప్రకటించింది. వెబ్‌సైట్‌లోని సమాచారం ప్రకారం, ఈ ప్లాన్‌లో 100 నిమిషాల ఉచిత కాలింగ్ లభిస్తుంది, 

 ఫ్రీ కాలింగ్ తరువాత నిమిషానికి 45 పైసల చార్జ్ చేస్తుంది. ఈ ప్రీ-పెయిడ్ ప్లాన్‌ ద్వారా 2 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్ సౌకర్యం లభిస్తుంది. ఈ ప్లాన్ నవంబర్ 29 వరకు అందుబాటులో ఉంటుంది.

మీరు బిఎస్ఎన్ఎల్ యూజర్ అయితే చెన్నై లేదా తమిళనాడు సర్కిల్ లో నివసిస్తుంటే, మీరు ఎస్‌టివీ కాంబో 49 అని టైప్ చేసి 123 కు ఎస్‌ఎం‌ఎస్ చేయడం ద్వారా ఈ ప్లాన్ ను యాక్టివేట్ చేయవచ్చు.