భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) కొత్త ప్రోమోషనల్ ఆఫర్ ప్రకటించింది. డేటాను అందించే ప్రత్యేక టారిఫ్ వోచర్లు (ఎస్‌టి‌వి) తో సహా ఇప్పటికే ఉన్న కొత్త ప్లాన్ వోచర్లపై 25 శాతం అదనపు డేటాను అందిస్తుంది.

అక్టోబర్ 31 చివరి వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ టెలికాం ప్రారంభించి 20 సంవత్సరాలు పూర్తయిన సంధర్భంగా టెలికాం ప్రొవైడర్ బిఎస్ఎన్ఎల్ ‘కస్టమర్ డిలైట్ మంత్’ వేడుకల్లో భాగంగా అక్టోబర్ నెలలో 25 శాతం అదనపు డేటా ఆఫర్‌ను ప్రవేశపెట్టింది.

 ఈ ఆఫర్ బిఎస్ఎన్ఎల్ తమిళనాడు వెబ్‌సైట్‌లోని సర్క్యులర్ ద్వారా అలాగే బిఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన రాజస్థాన్, పంజాబ్, తెలంగాణ ట్విట్టర్ ఖాతాల ద్వారా కూడా ప్రకటించింది. బిఎస్ఎన్ఎల్ పనిచేసే అన్ని సర్కిల్‌లలో 25 శాతం అదనపు డేటా ప్రయోజనం అందుబాటులో ఉందని ధృవీకరించింది.

also read హైపర్ గేమ్ టెక్నాలజీతో ఇన్ఫినిక్స్ హాట్ 10 స్మార్ట్‌ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే ? ...

కస్టమర్లు ఏదైనా ప్లాన్‌తో అందించే ప్రాథమిక డేటాతో పాటు 25 శాతం ఎక్కువ డేటాను పొందుతారు. వాయిస్, ఎస్‌ఎం‌ఎస్ ప్రయోజనాలను అందించే ప్లాన్ ల పై అదనపు డేటా అందించదు. ఈ ఆఫర్ అక్టోబర్ 31 వరకు ఉంటుంది.

గత నెలలో బిఎస్ఎన్ఎల్  చెన్నై సర్కిల్‌లో కొత్త రూ.49 ప్రీపెయిడ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ 100 నిమిషాల ఫ్రీ కాలింగ్‌ను అందిస్తుంది.

రూ. 499  వర్క్ ఫ్రోం హోమ్ ప్రమోషనల్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అండమాన్ మరియు నికోబార్ (ఎ అండ్ ఎన్ సర్కిల్) మినహా అన్ని సర్కిల్‌లలో   డిసెంబర్ 8 వరకు పొడిగించారు. ఈ ప్లాన్ 90 రోజులు ఉచిత ఇంటర్నెట్ సదుపాయాన్ని అందిస్తుంది.

వర్క్ ఫ్రోం హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ రోజుకి 5జి‌బి డేటాతో పాటు 10ఎం‌బి‌పి‌ఎస్ డౌన్‌లోడ్ స్పీడ్ అందిస్తుంది. రోజు డాటా పూర్తి అయిన తరువాత  స్పీడ్  1ఎం‌బి‌పి‌ఎస్ కు పడిపోతుంది.