భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) కొత్తగా రూ.49 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ 90 రోజుల పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఈ ప్లాన్ సెప్టెంబర్ 1 న ప్రవేశపెట్టారు, ప్రోమోషనల్  బేసిస్ కింద 90 రోజులు ఆక్టివ్ గా ఉంటుంది. ప్రస్తుతం చెన్నై, తమిళనాడు సర్కిళ్లలో అందుబాటులోకి తీసుకొచ్చారు.

రూ.49 రీఛార్జ్ ప్లాన్ 28 రోజుల వాలిడిటీతో డేటా, వాయిస్ కాల్స్, ఎస్‌ఎం‌ఎస్‌ ప్రయోజనాలు అందిస్తుంది. బిఎస్‌ఎన్‌ఎల్ చెన్నై వెబ్‌సైట్‌ ప్రకారం కొత్త రూ.49 ప్రీపెయిడ్ ప్లాన్ 100 నిమిషాల ఫ్రీ కాలింగ్‌ను అందిస్తుంది.

also read రెడ్‌మీ 9 సిరీస్ నుంచి మరో కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌.. లాంచ్ ఎప్పుడంటే ? ...

ఎఫ్‌యూ‌పి చేరుకున్న తరువాత బి‌ఎస్‌ఎన్‌ఎల్ ప్రతి కాల్ పై నిమిషానికి 45 పైసలు వసూలు చేస్తుంది. దీనితో పాటు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ 2జి‌బి డేటా, 100 ఎస్‌ఎం‌ఎస్ ఉచితంగా అందిస్తుంది.

బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ నవంబర్ 29 వరకు  ఆక్టివ్ ఉంటుందని టెల్కో పేర్కొంది. ఈ ప్లాన్ యాక్టివేషన్ సి-టాపప్, సెల్ఫ్ కేర్, వెబ్ పోర్టల్ ద్వారా అందుబాటులో ఉంది.

కస్టమర్లు ఈ ప్లాన్ ఆక్టివేట్ చేయడానికి STV COMBO49 అని టైప్ చేసి 123కు ఎస్‌ఎం‌ఎస్‌ పంపవచ్చు. బిఎస్‌ఎన్‌ఎల్ ఇటీవల రూ. 1,499 వార్షిక ప్రణాళిక ప్రవేశపెట్టింది.

రోజుకి 250 నిమిషాలపాటు ఆన్ లిమిటెడ్ అవుట్‌గోయింగ్ కాల్స్ చేసుకోవచ్చు.  రోజుకు 100 ఎస్‌ఎం‌ఎస్ లతో పాటు మొత్తం 24జి‌బి డేటా వస్తుంది.