భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) కొత్తగా  కొన్ని టెలికాం సర్కిల్‌లలో రూ.365 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీ 365 రోజులు. రీఛార్జ్ కాంబోలో రోజుకు 250 నిమిషాలు ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 2 జిబి డైలీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు వంటి ఉచిత ఫ్రీబీస్ ఉన్నాయి.

అయితే ఈ ఫ్రీబీస్ కేవలం 60 రోజుల వాలిడిటీతో వస్తాయి. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికం ఆపరేటర్ బిఎస్ఎన్ఎల్ ఇటీవల  ఛత్తీస్‌ఘడ్ సర్కిల్‌లో రూ.2,399 ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ తో ఎలాంటి  డేటాను లభించదు కాని 600 రోజుల దీర్ఘకాలిక వాలిడిటీ అందిస్తుంది.

కొత్త బీఎస్‌ఎన్‌ఎల్ రూ.365 రీఛార్జ్ ప్లాన్ ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్-జార్ఖండ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, కోల్‌కతా- పశ్చిమ బెంగాల్, ఈశాన్య,  ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు - చెన్నై, యుపి-ఈస్ట్, యుపి-వెస్ట్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ - ఛత్తీస్‌ఘడ్ లో అందుబాటులో ఉంది. 

ఈ ప్లాన్ తో రోజుకు 250 నిమిషాల (ముంబై, ఢీల్లీతో సహా లోకల్ / ఎస్‌టిడీ / నేషనల్ రోమింగ్) ఆన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందిస్తుంది. ఉచిత వాయిస్ కాల్ పరిమితిని చేరుకున్న తరువాత, బేస్ ప్లాన్ టారిఫ్ ప్రకారం ఛార్జీలు వర్తిస్తాయి.

also read జనవరి 1 తరువాత టీవీ, రిఫ్రిజిరేటర్, వాషింగ్ మెషిన్ కొంటున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోండి.. ...

రోజుకు 2జి‌బి వరకు ఆన్ లిమిటెడ్ హై స్పీడ్ డేటా ప్రయోజనంతో ఈ ప్లాన్ తీసుకొచ్చారు.  డైలీ లిమిట్ చేరుకున్న తరువాత, డేటా స్పీడ్ 80కే‌బి‌పి‌ఎస్ కు తగ్గించబడుతుంది. ఈ ప్లాన్ తో రోజుకు 100 ఎస్‌ఎం‌ఎస్ లు చేసుకోవచ్చు  అలాగే ఉచిత పర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్ (పి‌ఆర్‌బి‌టి) కూడా పొందవచ్చు.

పి‌ఆర్‌బి‌టి  సిటాప్అప్ లేదా ఆన్‌లైన్ రీఛార్జ్‌ ద్వారా  మాత్రమే లభిస్తుంది. ఎస్‌ఎం‌ఎస్ లేదా యూ‌ఎస్‌ఎస్‌డి ద్వారా రీఛార్జ్‌తో  లభించదు.  ఫ్రీబీస్ వాలిడిటీ 60 రోజులు, ప్లాన్ వాలిడిటీ 365 రోజులు ఉంటుంది. 60 రోజుల ఫ్రీబీస్ వాలిడిటీ ముగిసిన తరువాత వాయిస్, డేటా సదుపాయాన్ని కొనసాగించడానికి   వాయిస్ / డేటా వోచర్‌లను జోడించాల్సి ఉంటుంది.  

ఛత్తీస్‌ఘడ్ సర్కిల్‌లో బిఎస్‌ఎన్‌ఎల్ ఇటీవల రూ.600 రోజుల వాలిడిటీతో రూ.2,399 ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది. ఈ ప్లాన్ భారతదేశంలో ఏ నెట్‌వర్క్‌కైనా అవుట్‌గోయింగ్ కాల్స్ రోజుకు 250 నిమిషాల ఎఫ్‌యుపి పరిమితిని అందిస్తుంది.

మీరు రోజుకు 100 ఉచిత ఎస్‌ఎం‌ఎస్ లు చేసుకోవచ్చు. కాని ప్లాన్‌తో పాటు ఎలాంటి డేటా లభించదు, కాబట్టి మీరు సాధారణ డేటా రిచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది లేదా డేటా కోసం యాడ్-ఆన్ ప్యాక్‌ని ఉపయోగించాలి.