Asianet News TeluguAsianet News Telugu

బి‌ఎస్‌ఎన్‌ఎల్ కొత్త పోర్టల్.. భారత్ ఫైబర్ కనెక్షన్ల కోసం ప్రత్యేకంగా..

ఈ పోర్టల్ ఒక సులభమైన ఇంటర్‌ఫేస్‌ ఉంది, మీరు కొన్ని ప్రాథమిక వివరాలతో ఫీడ్ చేసిన తర్వాత మీ ఉండే ప్రదేశానికి పిన్‌పాయింట్లు ఇస్తారు. దీన్ని అనుసరించి, మీరు మీ ప్లాన్‌ను ఎంచుకొని భారత్ ఫైబర్ కనెక్షన్ అప్లికేషన్‌ను కన్ఫర్మ్ చేయవచ్చు. 

BSNL Launched  BookMyFiber Portal for Consumers to Apply for New Bharat Fiber Connections
Author
Hyderabad, First Published Aug 8, 2020, 1:21 PM IST

కొత్త భారత్ ఫైబర్ కనెక్షన్ల కోసం ‘బుక్‌మైఫైబర్’ పోర్టల్‌ను బిఎస్‌ఎన్‌ఎల్ ప్రారంభించింది. భారత్ సంచర్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) దేశంలోని అన్ని టెలికాం సర్కిల్స్ లో వినియోగదారులకు భరత్ ఫైబర్ సేవలను సులభంగా పొందటానికి ఇది సహాయపడుతుంది.

ఈ పోర్టల్ ఒక సులభమైన ఇంటర్‌ఫేస్‌ ఉంది, మీరు కొన్ని ప్రాథమిక వివరాలతో ఫీడ్ చేసిన తర్వాత మీ ఉండే ప్రదేశానికి పిన్‌పాయింట్లు ఇస్తారు. దీన్ని అనుసరించి, మీరు మీ ప్లాన్‌ను ఎంచుకొని భారత్ ఫైబర్ కనెక్షన్ అప్లికేషన్‌ను కన్ఫర్మ్ చేయవచ్చు.

కస్టమర్  డివైజ్ ప్రకారం పోర్టల్ ఆటొమేటిక్ గా కస్టమర్ ఉండే లొకేషన్ చూపిస్తుందని  సీనియర్ బిఎస్ఎన్ఎల్ ఎగ్జిక్యూటివ్ వెల్లడించారు.

కస్టమర్ జియో-కోఆర్డినేట్‌లను కలిగి ఉన్న ఎఫ్‌టిటిహెచ్ లీడ్ సమాచారం కస్టమర్‌కు ఎఫ్‌టిటిహెచ్ కనెక్షన్‌ను అందించడానికి ఎఫ్‌ఎంఎస్ సిస్టమ్‌లోకి పంపుతుంది. పోర్టల్‌ను బిఎస్‌ఎన్‌ఎల్ వెబ్‌సైట్ నుండి యాక్సెస్ చేయవచ్చు.

also read చైనాకు షాక్ మీద షాక్.. 2,500 యూట్యూబ్ చానల్స్ డిలీట్ చేసిన గూగుల్ ...

బి‌ఎస్‌ఎన్‌ఎల్  పోర్టల్ లోఒక మ్యాప్‌ ఉంటుంది. మీ లోకేషన్  కోసం మీ చిరునామాను టైప్ చేస్తే సరిపోతుంది. పోర్టల్‌లో నావిగేట్ చెయ్యడానికి సులభమైన ఇంటర్‌ఫేస్ ఉంది. చిరునామాను టైప్ చేయడానికి బదులుగా, మీరు పాయింటర్‌ను మీ ఖచ్చితమైన లొకేషన్ కోసం డ్రాగ్ చేయవచ్చు , దాని తరువాత చిరునామా కన్ఫర్మేషన్ కొరకు డైలాగ్ బాక్స్‌ కనిపిస్తుంది.

వినియోగదారులు స్టేట్, పిన్ కోడ్, పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్ వంటి ప్రాథమిక వివరాలను ఎంటర్ చేయాలి. వినియోగదారులు ప్లాన్, దాని వివరాలు, ప్లాన్ వ్యవధి, స్పీడ్, రేట్లతో సహా పోర్టల్‌లో అందిస్తారు.

భారత్ ఫైబర్ అనేది  బిఎస్ఎన్ఎల్ ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీస్. దీనిని మొదట 2019 ప్రారంభంలో ప్రారంభించింది. అప్పటి నుండి దేశవ్యాప్తంగా క్రమంగా విస్తరించింది.

దీని ప్లాన్ కొన్ని టెలికాం సర్కిల్‌లలో రూ.430 రూపాయలు నుండి మొదలవుతుంది, ఇతర ప్రదేశాలలో రూ. 499 నుండి ప్రారంభమవుతుంది. భారత్ ఫైబర్ కొన్ని ఎంచుకున్న నగరాల్లో 200Mbps ప్లాన్‌లను కూడా అందిస్తుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios